Balakrishna son-in-law Sri Bharath : రెండు రాష్ట్రాలలోనూ ఎండలు మండిపోతున్న వేల రాజకీయాల్లో కూడా వేడి మొదలయింది. పార్టీలన్నీ వచ్చే ఎన్నికల కోసం అపుడే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ఏపీ లో టీడీపీ వైసీపీ నువ్వా నేనా అన్నట్లు గా ప్లాన్ చేస్తుంటే మధ్యలో జనసేన నేనున్నానంటూ చెబుతోంది. మూడు పార్టీల ఆటలో ఈసారి విజయం ఎవరికి దక్కుతుందో తెలియదు కానీ మరోసారి అధికారంలోకి రావాలని వైసీపీ ప్రభుత్వం, వ్యతిరేకతను క్యాష్ చేసుకోవాలని టీడీపీ ఉవ్విళ్లూరుతున్నాయి. ఇక టీడీపీ నుండి నారా లోకేష్ ఇప్పటికే యువగళం పేరుతో పాదయాత్ర చేస్తుండగా బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీ భరత్ కూడా చురుగ్గా రాజకీయా మీటింగులకు హాజరువ్వుతూ ఉన్నారు. ఆయన ఈసారి విశాఖ ఎంపీ గా బరిలో దిగబోతున్నట్లు వార్తలు వినిపిస్తుండగా తాజాగా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ఎన్టీఆర్, బ్రాహ్మణి రాజకీయాల్లోకి…
టీడీపీ లో ఇప్పటికీ నడుస్తున్న హాట్ టాపిక్ అంటే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ఎపుడు వస్తారు అనే అంశం. తాత వారసత్వం పనికిపుచ్చుకున్న మనవడిగా గుర్తింపు తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ గతంలో టీడీపీ తరుపున ప్రచారం నిర్వహించారు. అయితే ఆ తరువాత రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాల మీద దృష్టి పెట్టిన ఎన్టీఆర్ మళ్ళీ రాజకీయాల వైపు వస్తారు అంటూ ఈ మధ్య కాలంలో జోరుగా వినిపిస్తుండగా ఈ విషయం గురించి బాలయ్య చిన్నల్లుడు శ్రీభరత్ క్లారిటీ ఇచ్చారు.

రాజకీయాల్లోకి వస్తాడని కాకపోతే సమయం ఎప్పుడని చెప్పలేమని మరో రెండున్నర ఏళ్లలో రావచ్చని చెప్పారు. ఇక వదిన బ్రాహ్మణి గురించి మాట్లాడుతూ తనకు పాలిటిక్స్ లోకి రావాలని ఆసక్తి లేదని తాను పాలిటిక్స్ లోకి రాదంటూ క్లారిటీ ఇచ్చారు. ఇక తాను ఎంపీ గా వైజాగ్ నుండి పోటీ చేయాలని అనుకుంటున్నట్లు తెలిపారు.