Bigg Boss Telugu Season 6: గత సీజన్‌లతో పోలిస్తే బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 అతి పెద్ద ఫ్లాప్‌గా నిలిచింది. షో మేకర్స్ కొన్ని ఆహ్లాదకరమైన అంశాలను జోడించడానికి ప్రయత్నించినప్పటికీ .. ఆసక్తికరమైన టాస్క్‌లను కేటాయించినప్పటికీ.. పోటీదారులు పెద్దగా ఉత్సాహం చూపకపోవడం వీక్షకులను నిరాశపరిచింది. ఇప్పుడు.. ఈ విషయాన్ని గ్రహించిన షో నిర్వాహకులు వీక్షకులకు మంచి కంటెంట్‌ను అందించాలనుకుంటున్నారు.
వచ్చే ఏడాది ఫిబ్రవరి ప్రారంభంలో కొత్త సీజన్‌ను ప్రారంభించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే చాలావరకు తెలిసిన సమాచారం ప్రకారం బిగ్ బాస్ ఓటీటీలో ప్రారంభించేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. బిగ్ బాస్ OTT కోసం షో మేకర్స్ ఇప్పటికే కొంతమంది సెలబ్రిటీలను ఖరారు చేసినట్లు చెబుతున్నారు. అయితే దీనికి ఎవరు హోస్ట్ చేస్తారనే దానిపై తాజా ఊహాగానాలు ఉన్నాయి.
తెలిసిన సమాచారం ప్రకారం బిగ్ బాస్ తెలుగు సీజన్ 6కి హోస్ట్‌గా నందమూరి బాలకృష్ణను నియమించాలని షో మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఆహాపై సెలబ్రిటీ టాక్ షో ‘అన్‌స్టాపబుల్’ షోతో తన అరంగేట్రం చేసిన తర్వాత బాలకృష్ణ గొప్ప హోస్ట్ అని నిరూపించుకున్నాడు. ఒకవేళ బాలకృష్ణ ఈ షోను హోస్ట్ చేయడానికి ఆసక్తి చూపితే, నాగార్జున షో నుండి తప్పుకునే అవకాశం ఉంది.
బిగ్ బాస్ సీజన్ 6 హోస్ట్ :
టాలీవుడ్ కింగ్ కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడని .. తన షెడ్యూల్ మధ్య బిగ్ బాస్ లో సరిపోయే అవకాశం లేదని.. అందుకే అతడు కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడంలేదనే సమాచారం. నాగ్ తన మునుపటి చిత్రం సోగ్గాడే చిన్ని నాయనాకు సీక్వెల్ అయిన బంగార్రాజుతో బిజీగా ఉండటమే కాకుండా.. రణబీర్ కపూర్ మరియు అలియా భట్ నటించిన అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో కరణ్ జోహార్ యొక్క బాలీవుడ్ ప్రాజెక్ట్ బ్రహ్మాస్త్రా కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. కాబట్టి మేకర్స్ కొత్త హోస్ట్‌ను తీసుకువచ్చే యోచనలో ఉన్నట్లు సమాచారం. దీనికి బాలయ్య ఖరారు అయినట్లు తెలుస్తోంది.
ఈ దేశంలో అన్ని భాషల్లోనూ, అన్ని రాష్ట్రాల్లోనూ ఎన్నో పీఠాలు, మఠాలు, దేవస్థానాలు, ధార్మిక మండళ్ళూ, ట్రస్ట్ లు, ధార్మిక…
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…