Balakrishna : అఖండ బ్లాక్ బస్టర్ విజయం తరువాత బాలకృష్ణ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తన నెక్స్ట్ సినిమా NBK@107 ను గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్నారు. ఈ సినిమా లో బాలయ్యకు జోడిగా శృతి హాసన్ మొదటిసారి నటిస్తోంది. ఇక సినిమాలో బాలయ్య తెలంగాణ యాసలో అలరిస్తాడని తెలుస్తోంది. ఇక సిరిసిల్ల లో మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుని ప్రస్తుతం సారథి స్టూడియోలో షూటింగ్ జరుపుకుంటోంది. ఇక ఈ సినిమా లో తొలిసారిగా కన్నడ హీరో దునియా విజయ్ విలన్ గా కనిపించబోతున్నాడు. సినిమా వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతోందని ఫిల్మ్ నగర్ టాక్.

ఇక గత కొన్నిరోజులుగా బాలకృష్ణ మోకాలి నొప్పితో బాధపడుతున్నారట. ఈ నొప్పి తీవ్రంగా ఉండటంతో సర్జరీ చేయించుకున్నారంటు న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. హాస్పిటల్ లో డాక్టర్లతో బాలకృష్ణ తీసుకున్న ఫోటో సోషల్ మీడియా లో బాగా వైరల్ అయింది. అయితే ఇందులో నిజమెంత అని ఎవరు ఆరా తీయలేదు అందరు ఫోటో చూసి నిజమని నమ్మేసారు.
అవన్నీ వదంతులే….
కానీ బాలకృష్ణ కు ఎటువంటి సర్జరీ జరగలేదని కేవలం సాధారణ చెక్ అప్ కోసం మాత్రమే ఆయన హాస్పిటల్ కి వెళ్లారని ఆ సమయంలో తీసుకున్న ఫోటో అని అభిమానులు ఆందోళన పడవద్దని చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం బాలయ్య సారథి స్టూడియోలో షూటింగ్ లో ఉన్నారని ఆయన బాగా ఉన్నారని చెప్పారు.
నటసింహం నందమూరి బాలకృష్ణ గారికి ఎటువంటి సర్జరీ జరగలేదు, ఆయన కేవలం రెగ్యులర్ చెకప్ కొరకు మాత్రమే హాస్పిటల్ కి వెళ్లడం జరిగింది.
— Vamsi Kaka (@vamsikaka) April 26, 2022
ఈ రోజు ఆయన సారధి స్టూడియోస్ లో #NBK107 షూటింగ్ లో పాల్గొన్నారు.
దయ చేసి అవాస్తవాలను ప్రచురించవద్దు, వ్యాప్తి చేయవద్దు.#NandamuriBalakrishna pic.twitter.com/2JjkiVms0P































