Balakrishna : ఏపీ ప్రభుత్వం హెల్త్ యూనివర్సిటీ పేరును వైస్సార్ హెల్త్ యూనివర్సిటీ గా మార్పు చేయాలని ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఈ ఇష్యూ మీద టీడీపీ పార్టీ శ్రేణులు, నందమూరి కుటుంబ సభ్యులు స్పందించారు. మార్చవద్దంటూ అభిప్రాయపడ్డారు. ఇక ఇలా స్పందించిన వారిలో జూనియర్ ఎన్టీఆర్ స్పందన మాత్రం టీడీపీ శ్రేణులకే కాదు నందమూరి అభిమానులకు రుచించలేదు. తారక్ ఇలా ఎందుకు మాట్లాడాడు, ఎన్టీఆర్ ను వైస్సార్ తో పోల్చడమేంటి అంటూ అక్షేపించారు. ఇక ఈ విషయం మీద ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణ కూడా స్పందించారు. చాలా ఘాటుగా ప్రభుత్వం గురించి, సీనియర్ రాజకీయ నేతల గురించి మాట్లాడారు.

నేతలు.. పీతలు.. కుక్కలు సిగ్గుపడుతున్నాయి మిమ్మల్ని చూసి…
తండ్రి ఎయిర్ పోర్ట్ పేరు మారిస్తే, తనయుడు హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చాడు. ఎన్టీఆర్ గారు రాజకీయా భిక్ష పెడితే బ్రతుకుతున్న నేతలు, పీతలు చాలా మందే ఉన్నారు. విశ్వాసం లేని కుక్కలను చూసి కుక్కలే సిగ్గుపడుతున్నాయి అంటూ బాలకృష్ణ బాగా ఘాటుగా స్పందించారు.

Balayya via Facebook#NandamuriBalakrishna #NTRHealthUniversity pic.twitter.com/veKCORFPgO
— Nandamuri Balakrishna™ (@NBK_Unofficial) September 24, 2022
పేర్లు మార్చుకుంటూ మీరు పోతే ప్రజలు ప్రభుత్వాన్ని మారుస్తారు, పంచబూతాలే మిమ్మల్ని చూసుకుంటాయి అంటూ స్పందిస్తారు. ఈ ఇష్యూని అందరూ వ్యతిరేకస్తున్నా ఏపీ గవర్నమెంట్ మాత్రం తగ్గడం లేదు. ఆల్రడీ పేరు మార్పు పై ఉత్తర్వులు కూడా జారీ చేసేసింది.
































