Balakrishna: బాలయ్య టాక్ షో రికార్డ్.. ‘అన్ స్టాపబుల్’ కు బాలయ్య రెమ్యూనరేషన్ లీక్..!
Balakrishna: అఖండ భారీ విజయంతో సిల్వర్ స్క్రీన్ పై సత్తా చూపించాడు. రికార్డ్ కలెక్షన్లు రాబట్టాడు. కరోనా తరువాత.. థియేటర్లు జనాలు వస్తారా.. రారా.. అని సందిగ్థంలో ఉన్న క్రమంలో బాలయ్య మ్యాజిక్ చేశాడు. ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు. భారీ విజయాన్ని అఖండకు అందించారు. బోయపాటి మేకింగ్, బాలయ్య నట విశ్వరూపం మొత్తంగా అఖండ రచ్చ చేసింది.
ఇదిలా ఉంటే బాలయ్య ఓటీటీలో కూడా తగ్గేది లే.. అని నిరూపించాడు. ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ‘‘ అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే’’ పెద్ద సక్సెస్ అయింది. తెలుగు టాక్ షోల్లోనే బెస్ట్ గా నిలిచింది. రికార్డ్ వ్యూస్ అందుకుంది. బాలయ్య హోస్ట్ గా అదరగొట్టాడు.
టాక్ షోలో తన ఎనర్జీ పీక్స్. గెస్ట్ లుగా వస్తున్నవారిని తనదైన శైలిలో ఆటాడుకుంటున్నాడు. ఇప్పటికే మొదటి సీజన్ షూటింగ్ పూర్తియినట్లగా తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఈ షోకు మోహన్ బాబుతో మొదలు.. రాజమౌళి, శ్రీకాంత్, కీరవాణి, అల్లు అర్జున్, రవితేజ మొదలైనవారు గెస్ట్ లుగా వచ్చారు. తాజాగా చివరి ఎపిసోడ్ కు ఛార్మీ, రౌడీ హీరో విజయ్ దేవరకొండ రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీరిద్దరిపై షూటింగ్ కంప్లీట్ అయింది. ఇప్పటికే ఈ ఎపిసోడ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అయితే ఈ షో ఇటీవల మరో రికార్డ్ క్రియేట్ చేసింది. IMDBలోని టాప్ 10 రియాలిటీ టీవీ జాబితాలో ‘అన్ స్టాపబుల్’ స్థానం దక్కిం చుకుంది. ఈ తెలుగు టాక్ షోకి ఇది అరుదైన విజయం. అయితే మొదటి సీజన్ కు బాలయ్యకు రెమ్యునరేషన్ గా ఒక్కో ఎపిసోడ్ కు రూ. 25 లక్షలు ముట్టచెప్పినట్లు సమాచారం. షో విపరీతంగా హిట్ కావడంతో రెండో సీజన్ కు ఎంత ఇస్తారనేది ఆసక్తి రేపుతోంది. అయితే ప్రస్తుతం ఉన్న సమచారం ప్రకారం రెమ్యునరేషన్ రెట్టింపు చేస్తారని తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…