Bandla Ganesh: వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచే బండ్ల గణేష్ తరచూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తలు నిలుస్తుంటారు.ఈ క్రమంలోనే బండ్ల గణేష్ తాజాగా అల్లు బ్రదర్స్ గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ అల్లు బాబీ గురించి ఈయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఓ ప్రైవేట్ ఫంక్షన్లో భాగంగా అల్లు బాబీతో కలిసి బండ్ల గణేష్ ఫోటోలకు ఫోజులిచ్చారు. అనంతరం బండ్ల గణేష్ మాట్లాడుతూ.. అందరికీ చెబుతున్నా.. తండ్రి మాట ఎవరు వినొద్దు… తండ్రిని గౌరవించి ఆయన మాట వింటే ప్రతి ఒక్కరూ బాబిలా తయారవుతారు. అలాకాకుండా తండ్రి మాట వినకుండా తమకు ఇష్టం వచ్చినట్లు చేస్తూ ఉంటారు అలాంటివారు బన్నీలా తయారవుతారు అంటూ చెప్పుకొచ్చారు.
బన్నీ లాగా తయారు అవుతారా? బాబీ లాగా తయారవుతారా నిర్ణయించుకోండి.చిన్నప్పటినుంచి బాబి తండ్రి మాట విని మంచిగా చదువుకొని ఇలాగ ఉన్నారు కానీ అల్లు అర్జున్ తనకు ఇష్టం వచ్చినట్లు చేస్తూ పాన్ ఇండియా హీరోగా మారిపోయారు అంటూ బండ్ల గణేష్ ఇక్కడ బాబీని తక్కువ చేస్తూ అల్లు అర్జున్ గొప్పగా పొగుడుతూ మాట్లాడారు.
ఇలా బండ్ల గణేష్ మాట్లాడినప్పటికీ ఈ విషయాలను బాబి చాలా పాజిటివ్ గా తీసుకొని సరదాగా నవ్వారు. ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ వీడియో పై స్పందించిన కొందరు ఏంటి బండ్లన్న అల్లు బ్రదర్స్ మధ్య కూడా చిచ్చు పెట్టడానికి ప్లాన్ చేస్తున్నావా అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…