Bandla Ganesh : క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చిన్న చిన్న పాత్రలు వేస్తూ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న బండ్ల గణేష్ ఆ తరువాత ప్రొడ్యూసర్ గా మారీ సినిమాలను నిర్మించారు. ఎన్నో కాంట్రావెర్సీ లకు కేర్ ఆఫ్ గా నిలబడిన బండ్ల గణేష్ ఒకప్పుడు స్టార్ హీరోల్తో సినిమాలను తీసి వరుస హిట్లను చూసారు. ప్రస్తుతం సినిమా నిర్మాణంలో లేకపోయినా పాలిటిక్స్ గురించి అలానే సినిమా ఇండస్ట్రీ గురించి తనదైనా శైలి లో మాట్లాడుతూ బాగా సోషల్ మీడియాలో నానే బండ్లన్న తన సినిమాల గురించి సినిమా నిర్మాణం గురించి సినిమా హీరోల గురించి ఆసక్తికర వాఖ్యలను చేసారు.

నాకు కులం కూడు పెట్టలేదు…
బండ్ల గణేష్ మొదటి నుండి మెగా కాంపౌండ్ కి దగ్గరగా ఉండేవారు. చిరంజీవి తనకు చాలా ఇష్టమైన హీరో అంటూ తెలిపిన ఆయన, తనకు క్యాస్ట్ ఫీలింగ్ కమ్యూనిటీ అంటూ ఫీలింగ్స్ లేవంటూ తెలిపారు. అందుకే నా కమ్యూనిటీ వాళ్లకు దగ్గరగా లేనని చెప్పారు. ఇక బాలకృష్ణ గారితో పరిచయం ఎక్కువగా లేదని ఇక చిరంజీవి గారంటే చాలా ఇష్టమని అందుకే ఆయన కుటుంబంతో సన్నిహితంగా ఉన్నానని చెప్పారు.

అయినా చిరంజీవి, బాలకృష్ణ అనే కాంపౌండ్ అంటూ మనం అనుకోవడమే వాళ్ళు వాళ్ళు ఎపుడు కలిసి ఉంటారు మధ్యలో మనమే గొడవపడేది వాళ్ళ కోసం,అవసరమా అంటూ మాట్లాడారు. బాలకృష్ణ గారితో శత్రుత్వం లేదు అలాగని మిత్రుత్వం లేదు ఇక నందమూరి కుటుంబానికి దూరం అనడం తప్పు ఎందుకంటే ఎన్టీఆర్ తో సినిమా చేశాను తనతో సాన్నిహిత్యం ఉంది అంటూ తెలిపారు. చిన్నప్పటి నుండి చిరంజీవి గారంటే ఇష్టం అందుకే ఆ ఫ్యామిలి కి దగ్గరయ్యను అంతే అంటూ క్లారిటీ ఇచ్చారు బండ్లన్న.






























