Bandla Ganesh : నటుడు, ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ తన స్పీచ్ లతో బాగా ఫేమస్. తీసింది కొన్ని సినిమాలే అయినా అవి కూడా కొన్నే హిట్లైనా బండ్ల గణేష్ మాత్రం ఎపుడూ ఏవో ఒక కామెంట్స్ తో బాగా వైరల్ అవుతుంటాడు. ఆవేశంగా ఒకరిమీద కామెంట్స్ చేసే బండ్ల గణేష్ పూరి జగన్నాథ్ తో కలిసి కొన్ని సినిమాలను చేసారు. నటుడుగా పూరి సినిమాలో చేసాడు, అలాగే నిర్మాతగా సినిమాను నిర్మించాడు. ఇక పూరికి, బండ్ల గణేష్ కి ఎక్కడ చెడిందో కానీ మొన్నామధ్య పూరి ఛార్మి బంధం గురించి పరోక్షంగా కామెంట్స్ చేసి వైరల్ అయ్యాడు బండ్లన్న. మళ్ళీ ఇప్పుడు డైరెక్ట్ గా కామెంట్స్ చేసాడు.

కుటుంబాన్ని వదిలేసినవాడు మనిషి కాదు…
తాజాగా బండ్లన్న ఐ డ్రీమ్ నాగరాజు కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బండ్ల గణేష్ పూరి జగన్నాథ్ గురించి నేరుగా కామెంట్స్ చేసాడు. ఆ మధ్య పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి సినిమా ‘చోర్ బజార్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పూరి రాకపోవడన్ని తప్పు పడుతూ కుటుంబం పిల్లల కన్నా ఏవి ఎక్కువ కాదు అంటూ కామెంట్స్ చేసారు. యాంకర్ అడిగిన ప్రశ్నకు బదులుగా ఘాటు కామెంట్స్ చేసారు. పోసాని గురించి బండ్ల అతనికి మామూలు చావు రాదంటూ, ఎందుకు మాట్లాడరని యాంకర్ అడుగగా నా కుటుంబాన్ని అతను ఎందుకు కామెంట్స్ చేయాలి అందుకే అలా అన్నాను అంటు సమర్తించుకున్నాడు.
ఇక మరి పూరి జగన్నాథ్ ది కూడా ఫ్యామిలీ నే కదా మరి ఆయన్ను ఎందుకు కామెంట్ చేసావ్, నాలుక జాగ్రతగా పెట్టుకో అని పూరి కామెంట్ కూడా చేసాడు కదా వాటి పై స్పందన ఏమిటి అని నాగరాజు అడుగుగా బండ్ల గణేష్ మనిషన్నవాడు కుటుంబాన్ని వదిలేయడు అంటూ మాట్లాడాడు. ఇక రాజకీయాల గురించి మాట్లాడను అంటూ నువ్వు ఎంత ఇరుకున పెట్టినా వాటిపై స్పందిచను అంటూ మాట్లాడారు. ఇక పూరి పై బండ్ల చేసిన కామెంట్స్ మరో సారి వైరల్ అయ్యాయి.



























