Bandla Ganesh : కొందరు ఉరికే మాట్లాడినా అది సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది. అలాంటి వారిలో సినిమా ఆర్టిస్ట్, నిర్మాత బండ్ల గణేష్ ఒకరు. ఆయన ఎవరి గురించి మాట్లాడినా అదొక వైరల్ న్యూస్ అవ్వక మానదు. ఇప్పుడు కూడా రీసెంట్ ఇంటర్వ్యూలో పాలిటిక్స్ నాకవసరం లేదు నేను మాట్లాడను అంటూనే వాటి గురించి హాట్ కామెంట్స్ చేస్తూ మరో సారి వైరల్ అయ్యారు బండ్ల గణేష్. ఒకప్పుడు విమర్శించిన వారిని ఇప్పుడు ప్రశాంశించడం, అలానే నాకు వారితో ఎలాంటి వైరుద్యం లేదు అని చెప్పడం బండ్లన్నకే చెల్లింది.

రోజా నా సోదరి వంటిది…
ఒకప్పుడు ప్రస్తుత ఏపీ ప్రభుత్వంలో మంత్రి గా పనిచేస్తున్న ఆర్కే రోజా, ఒకప్పటి హీరోయిన్ అయిన రోజా ను బండ్లన్న బాగా విమర్శించాడు. ఇప్పుడు మాత్రం రోజా నా సిస్టర్ అంటూ మాట్లాడుతున్నారు. ఇంత మార్పుకు కారణం తెలియదు కానీ రోజా నా సోదరి వంటిది, ఆమెను చూసి ఎంతో నేర్చుకోవాలి, హీరోయిన్ గా ఉన్నపుడు ఎంతో కష్టపడి ఆ స్థాయికి వచ్చింది. ఇప్పుడు రాజకీయాల్లోనూ రెండు సార్లు ఓడిపోయి మరో రెండు సార్లు పట్టుదలతో గెలిచి మంత్రి అయింది.

ఎంతో పోరాడింది జీవితంలో, ఎంత మంది హీరోయిన్స్ ఈ స్థాయికి రాగలుగుతారు అంటూ మాట్లాడారు. ఒకప్పుడు అన్న మాటలు ఏవో కోపంలో ఆవేశంగా అప్పటికి అన్నవే కానీ తనతో ఎలాంటి శత్రుత్వం లేదంటూ మాట్లాడారు బండ్ల గణేష్. రోజా బ్రదర్స్ కూడా నాకు బాగా క్లోజ్ అంటూ ఏపీ మంత్రుల్లో చాలా మందితో సత్సంబంధాలు ఉన్నాయని అయితే ఏపీ రాజకీయాల గురించి మాట్లాడాలని అనుకోవడం లేదంటూ చెప్పారు.































