Nagarjuna: టాలీవుడ్ ఇండస్ట్రీకు చెందిన స్టార్ హీరో నాగార్జున గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తొలిసారిగా విక్రమ్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నాగార్జున ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరోగా ఎదిగాడు. పైగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.

ఇక ఈయన ఏ డైరెక్టర్ సినిమాకైనా తేడా చూపించకుండా వారికి అవకాశాలు ఇస్తాడు. ఆ సినిమాలు ప్లాప్ అయినా మళ్లీ కొత్త దర్శకులకు అవకాశాలు ఇస్తూ ఉంటాడు. ఇక ఇప్పటికి ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉన్నాడు నాగార్జున. ప్రస్తుతం బిగ్ బాస్ లో హోస్టింగ్ తో ఓ రేంజ్లో దూసుకుపోతున్నాడు.
ఇదిలా ఉంటే ఈయన వల్ల కో డైరెక్టర్ కెరీర్ నాశనం అయింది అని.. దాంతో ఆ దర్శకుడికి నాగార్జున వల్ల విభేదాలు వచ్చాయని గతంలో బాగా వార్తలు వచ్చాయి. దీంతో తాజాగా దీని గురించి ఆ డైరెక్టర్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కొన్ని విషయాలు బయట పెట్టాడు. ఆ డైరెక్టర్ ఎవరో కాదు.. వీరభద్రం చౌదరి.

ఈయన దర్శకుడిగా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. నాగార్జున నటించిన బాయ్ సినిమాకు దర్శకత్వం వహించాడు. కానీ నాగార్జున కెరీర్లో ఇది చాలా ఘోరమైన సినిమా అనే చెప్పాలి. ఈ సినిమాతో ఊహించని రిజల్ట్ సొంతం చేసుకున్నాడు నాగార్జున. ఈ సినిమా ఫ్లాప్ అవడంతో నాగార్జున చాలా నిరాశ చెందాడు.

నాగార్జునతో తనకు విభేదాలు లేవన్న డైరెక్టర్..
బాయ్ కథ హిలేరియస్ కథ అని.. కానీ చేసిన మార్పుల వల్ల సినిమా సీరియస్ కథ గా మారింది అని అన్నాడు. ఈ సినిమాలో కామెడీ లేకపోవడంతో సినిమా ఫ్లాప్ అయింది అని అన్నాడు. సినిమా ఫ్లాప్ అయిన హిట్ అయిన డైరెక్టర్ అదే బాధ్యత అని కూడా అన్నాడు. ఇక భాయ్ సినిమా వల్ల తనకు నాగార్జునకు విభేదాలు లేవని అన్నాడు. కానీ నాగార్జున వల్లే ఆయనకు పరోక్షంగా కెరీర్ దెబ్బతిన్నదని అర్థమవుతుంది.





























