Bengaluru Padma : సీరియల్స్ లోను సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను సుపరిచితురాలైన బెంగళూరు పద్మ గారు ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. జీ తెలుగులో వచ్చే ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నటించిన ఆమె ప్రస్తుతం ఏ ప్రొజెక్ట్ చేయకుండా వ్యక్తిగత జీవితంలో చాలా బిజీగా ఉన్నారు. పద్మ గారి కూతురు గాయత్రి కూడా నటి. హ్యాపీడేస్ సినిమాలో అప్పు గా నటించి మంచి గుర్తింపు అందుకుంది. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన పద్మ గారు ఇండస్ట్రీలో కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

మురళీ మోహన్ గారిని అలా అన్నందుకు మా నాన్న తిట్టారు…
ఎక్కువగా ఈటీవీ అలాగే సురేష్ ప్రొడక్షన్స్ లో పని చేసిన బెంగళూరు పద్మ గారికి ఆ పేరు పెట్టింది కూడా రామానాయుడు గారే. వందలలో సినిమాల్లో పనిచేసిన పద్మ గారు సీరియల్స్ లో కూడా చాలా వాటిలో చేశారు. ఇక కొన్ని సినిమాల్లో ఒకరోజు షూటింగ్ అయ్యాక క్యారెక్టర్ ను మార్చేస్తారు. అలా డైరెక్టర్ తేజ ఒక సినిమాలో ఒక రోజు షూటింగ్ అయ్యాక మరుసటి రోజుకు వేరే ఆర్టిస్ట్ ను పెట్టుకోవడంతో కాస్త బాధగా అనిపించింది అంటూ చెప్పారు.

అయితే ఆ సినిమాలో చేయాల్సినటువంటి పాత్రను నేను కావ్యాంజలి అనే సీరియల్ లో చేశాను. తెలంగాణ యాస మాట్లాడుతూ వడ్డీ వ్యాపారం చేస్తూ చాలా రౌడీ గా ఉండే ఆ క్యారెక్టర్ లో అందరినీ తిడుతుంటాను. అలా మురళీ మోహన్ గారు ఆ సీరియల్ లో ఉన్నారు, ఆయనను కూడా కాలర్ పట్టుకుని బూతులు తిట్టాను. ఆ ఎపిసోడ్ ప్రసారమయ్యాక మా నాన్న పిలిచి అలాంటి మాటలు ఎపుదూ మాట్లాడకు, అలాంటి నటన వద్దు అని చెప్పారు. ఆ బూతుకు అర్థం తెలియక ముందే తిట్టేసాను అంటూ బెంగళూరు పద్మ తెలిపారు.