Bhuma Akhila Priya : మంచు మనోజ్ మంచు విష్ణు వివాదం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నడుస్తుండగా భూమా మౌనిక తో మనోజ్ పెళ్లి తరువాతే విష్ణు కి మనోజ్ కి గొడవ పెరిగిందనే టాక్ వినిపిస్తుంది. ఆ పెళ్లి ఇంట్లో ఎవరికీ ఇష్టం లేకపోయినా మనోజ్ చేసుకున్నాడు అనే పుకార్లు వినిపిస్తున్నాయి. ఇక మంచు విష్ణు భార్య వేరొనిక కుటుంబానికి అలాగే మౌనిక కుటుంబానికి మధ్య రాజకీయంగాను అలాగే ఫ్యాక్షన్ గొడవలు ఉన్న నేపథ్యంలో ఈ పెళ్లి విష్ణు అలాగే ఆయన భార్యకు ఇష్టం లేదని వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంలో భూమా మౌనిక అక్క భూమా అఖిల ప్రియ స్పందించారు.

వాళ్ళ కుటుంబ విషయం…
భూమా కుటుంబానికి రాయలసీమ రాజకీయాలలో మంచి గుర్తింపు ఉంది. దురదృష్టవశత్తు శోభా నాగిరెడ్డి అలాగే భూమా నాగిరెడ్డి గారి అకాల మరణం వారి కుటుంబాన్ని కుదిపేసింది. భూమా అఖిల ప్రియ పెద్ధ అమ్మయిగా తానే కుటుంబ బాధ్యతలు తీసుకోగా చెల్లి మౌనిక రెడ్డి అక్కకు రాజకీయంగా తోడుగా ఉంది. ప్రస్తుతం భూమా మౌనిక రెడ్డి తన రెండో వివాహం మంచు మనోజ్ తో చేసుకోవడంతో రాజకీయంగా రాయలసీమలో ప్రభావం చూపవచ్చు.

భూమా అఖిల ప్రియ తాజాగా మీడియతో ఎమ్మెల్సి ఎన్నికలు పార్టీ మారడం గురించి మాట్లాడుతూ టీడీపీని వీడే ఆలోచన లేదంటూ స్పష్టం చేసారు. ఇక అదే ఇంటర్వ్యూలో ప్రస్తుతం వైరల్ గా ఉన్న మంచు విష్ణు, మనోజ్ ల గొడవ గురించి అడుగగా వారి కుటుంబ విషయం వాళ్ళను అడిగితే బాగుంటుంది. నేనేం చెప్తాను వాళ్ళ ఫ్యామిలీ గురించి అంటూ భూమా అఖిల ప్రియ వారి గురించి మాట్లాడటానికి నిరాకరించారు.