Big boss contestant Marina : బిగ్ బాస్ షో గురించి మంచిగా చెప్పే వాళ్ళ కంటే తిట్టే వాళ్ళే ఎక్కువ. అయిన షో కి రేటింగ్స్ మాత్రం తగ్గడం లేదు. అయితే ఈసారి రేటింగ్స్ లో వెనుకబడింది అది వేరే విషయం. షో లో బూతులు తిట్టుకోవడం, డబల్ మీనింగ్ డైలాగులు ఒక ఎత్తు అయితే ఈ సారి హౌస్ లోకి సీజన్ 3 లో లాగా రియల్ కపుల్ ని పంపారు.మరీనా రోహిత్ లు భార్యభర్తలుగా షోకి వెళ్లిన ఎవరి ఆట వారిదే. కాకపోతే ఇద్దరు కలిసే మొదటి నుండి గేమ్ ఆడారు. ఇక ఎలిమినేట్ అయ్యాక తాజాగా ఇంటర్వ్యూ లో పాల్గొన్న మరీనా, హౌస్ లోకి వెళ్లడమే గొప్ప సక్సెస్ అంటూ చెబుతూ.. ఎంతో మంది బిగ్ బాస్ ఆఫర్ కోసం ఎదురు చూస్తారు. అలాంటి షోలో వెళ్లి టాప్ టెన్ వరకు ఉండటం నాకు సక్సెసే అంటూ చెప్తూ తన వ్యక్తిగత విషయాలను పంచుకుంది.

ఫస్ట్ కిస్… పెళ్ళికి ఎలా ఒప్పించారు….
మరీనా, రోహిత్ లు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. ఇద్దరి మతాలు వేరవడం వల్ల ఇంట్లో వీళ్ళ పెళ్ళికి మొదట అంగీకరించలేదు. మరీనా క్రిస్టియన్ అవడం వల్ల రోహిత్ ఇంట్లో మొదట తను కుటుంబంలోకి వస్తే సర్దుకుంటుందా అనే సందేహం తో వద్దన్నారట. అయితే మరీనా, రోహిత్ తల్లిదండ్రులను, రోహిత్, మరీనా తల్లిని ఒప్పించి చివరకు పెళ్లి చేసుకున్నారు.

ఇక ఫస్ట్ కిస్ గురించి చెబుతూ ఎవరు మొదట పెట్టారు అనే ప్రశ్న ఎదురుకాగా ఇద్దరం పెట్టుకుంటేనే ముద్ధవుతుంది కదా అంటూ బోల్డ్ గా సమాధానం చెప్పింది మరీనా. ఇక రోహిత్ మొదటగా తనకు ఇచ్చిన గిఫ్ట్ బాత్ రోబ్ అదికూడా తన అమ్మతో వెళ్లి తీసుకొచ్చాడు ఇక రింగ్, ఒక లాకెట్ గిఫ్ట్ ఇచ్చాడు అంటూ మరీనా తన స్వీటీ మెమోరీస్ ను షేర్ చేసుకున్నారు.































