Big boss Geethu Parents : బిగ్ బాస్ సీజన్ 6 లో కంటెస్టెంట్ గా, ఇంట్లో చలాకిగా గేమ్ ఆడుతూ అందరినీ ఎంటర్ టైన్ చేస్తున్న గీతూ రాయల్ మొదట టిక్ టాక్ లో వీడియోస్ చేస్తూ ఆ తరువాత ఇంస్టాగ్రామ్ రీల్స్ తో ఫేమస్ అయి మళ్ళీ బిగ్బాస్ రివ్యూలతో మరింత ఫాలోయింగ్ తెచ్చుకుంది. గలాట గీతూ ఒక్క మాటలో చెప్పాలంటే తనను బిగ్ బాస్ సీజన్ 6 ఆడపులి అనవచ్చు. హౌస్ అంతా ఒకవైపు నేను ఒక వైపు అన్నట్లుగా సాగినా గీతూ మాత్రం తగ్గకుండా గేమ్ ఆడుతోంది. తన యాస, మాటలతో అందరినీ ఆకట్టుకుంటున్న గీతూ గురించి ఆమె తల్లిదండ్రులు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు.

మూడు సార్లు చనిపోయి బతికింది…
గీతూ తల్లి సుధ రాజ్యం గారు కేశవరెడ్డి స్కూల్ లో ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్నారు. ఇక తండ్రి శేఖర్ గారు కేశవ రెడ్డి స్కూల్ లో నే అడ్మినిస్ట్రేషన్ వైపు పనిచేస్తున్నారు. ఇక గీతూని చిన్నప్పటి నుండి చాలా గారాబంగా పెంచామని అయితే ఇప్పుడు బిగ్ బాస్ లో తమ కూతురు ఆట చూస్తుంటే చాలా గర్వంగా ఉంది అంటూ గీతూ పేరెంట్స్ చెప్పారు. ఇక గీతూ మూడుసార్లు చనిపోయి బతికిందంటూ తల్లి సుధ గారు చాలా ఎమోషనల్ అయ్యారు. గీతూ పదవ తరగతి చదివే సమయంలో కామెర్లు వచ్చి ఎక్కువ అవ్వడం వల్ల చెన్నై కి తరలించి అక్కడ చికిత్స కోసం డాక్టర్లు చేర్చుకోలేమని పరిస్థితి చేజరిపోయిందని చెప్పినా చివరికి చేర్చుకున్నారు.

తను బ్రతకదని డాక్టర్స్ చెప్పేశారట. లివర్ కొంత భాగం తీసివేయాల్సి ఉంటుంది అంటూ చెప్పేసరికి భయపడ్డామని కానీ తను బ్రతికి బయటికి వచ్చింది అంటూ గీతూ పేరెంట్స్ ఎమోషనల్ అయ్యారు. ఇక బస్ యాక్సిడెంట్ అపుడు కోమాలోకి వెళ్ళిపోయింది. అలా మూడు సార్లు తను చనిపోయి బ్రతికింది. అందుకే దేవుడు నీకు మూడు అవకాశాలు ఇచ్చాడు నీ నుండి ఏదో ఒక మంచి ఆశిస్తున్నాడు అందుకే నువ్వు బతికావు అని గీతూకి తల్లి సుధ చెప్పేవారట. ఇక ఇప్పుడు బిగ్ బాస్ ద్వారా ఈ తరం అమ్మాయిలకు ఆమె రోల్ మోడల్ గా ఉంటుందంటూ గర్వంగా గీతికా పేరెంట్స్ చెప్పారు.































