Big Boss season 6 : బిగ్ బాస్ షో గురించి మంచిగా చెప్పే వాళ్ళ కంటే తిట్టే వాళ్ళే ఎక్కువ. అయినా షో కి రేటింగ్ ఉంటూ దూసుకుపోతోంది. అయితే ఈసారి రేటింగ్స్ లో వెనుకబడింది.. అది వేరే విషయం. షో లో బూతులు తిట్టుకోవడం, డబల్ మీనింగ్ డైలాగులు మరో ఎత్తు. ఈ షోని ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని చూడలేక పోతున్నామని చాలా మంది అభిప్రాయపడుతున్నారు కూడా. ఇక సిపిఐ నారాయణ వంటి వారైతే పరుషంగా షో గురించి విమర్శిస్తున్నారు. ఇన్ని జరుగుతున్నా షో చూసేవాళ్ళు లేక పోలేదు. కాకపోతే ఇటీవల జరిగిన ఒక సంభాషణ మాత్రం మళ్ళీ ఇలానా ఛీ ఛీ ఏంటిది అనేలా ఉంది బిగ్ బాస్ లో.

షాక్ అయిన నాగ్, తమన్నా…
హౌస్ లోకి వెళ్ళాక ఎవరికి వారు వారికి నచ్చిన వారికి కనెక్ట్ అవుతారు, వాళ్ళు కలిసి తిరగడం చూస్తుంటాం. అయితే ముగ్గురు అబ్బాయిలు ఒకే మంచం మీద అది కూడా ఒకే దుప్పటి కప్పుకుని పడుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. శ్రీహన్ ప్రతిరోజు పొద్దునే లేచేసరికి తన మెడ మీద ఏవో మార్క్ లు ఉంటున్నాయంటూ అర్జున్ వచ్చాకే ఇలా జరుగుతోందంటూ చెప్పడం తో అసలు ఏం జరుగుతోంది, దుప్పట్లో దూరాక ఏం చేస్తున్నార్రా బాబు అంటూ చూసే ఆడియన్స్ విసుకుంటున్నారు.

ఇక ఈ పంచాయతీ వీకెండ్ నాగార్జున ముందుకు వచ్చింది. నాగ్ తో పాటు గెస్ట్ గా ఉన్న తమన్నా కూడా వీళ్ళ మాటలు విని షాక్ అయింది. ఇక శ్రీహన్ తన మెడ మీద ఉన్న మార్క్ గురించి చెబుతుంటే ఆరోహి ముగ్గురూ ఒకే దుప్పటి కప్పుకుని పడుకుంటారు అసలు ఏం చేస్తారో తెలియదు పొద్దునే ఇలా ఒంటి మీద మార్క్ లు ఉంటాయి అంటూ ద్వంద్వ అర్థం వచ్చేలా మాట్లాడింది. ఇక ఈ విషయాన్ని మీమర్స్ వదులుతారా దుప్పట్లో జింతాత జిత జిత అంటూ మీమ్స్ తో రెచ్చిపోతున్నారు. చూసే ప్రేక్షకుడు మాత్రం ఏంట్రా మాకీ కర్మ అనుకుంటున్నారు. కానీ ఇలాంటి వాటి వల్లే బిగ్ బాస్ రేటింగ్స్ పెరుగుతాయంట…