Big boss season 6 : బిగ్ బాస్ తెలుగులో మొదటి రియాలిటీ షో రేటింగ్స్ లో దూసుకుపోతోంది. ఈ షోలో పాల్గొంటే ఇక అంతే వాళ్ళ కెరీర్ పీక్స్ కి పోయినట్లే.. ఇవన్నీ గతమనుకోవాలేమో.. ఎందుకంటే బిగ్ బాస్ ప్రస్తుతం రేటింగ్స్ లేక విలవిల లాడుతోంది. షోలో కంటెస్టెంట్ల పర్ఫార్మన్స్ సరిగా లేక చప్పగా ఉన్నాయి ఎపిసోడ్స్. ఇక పేలవమైన హోస్టింగ్.. నాగార్జున హోస్టింగ్ గురించి ముందు నుండి విమర్శలు ఉండనే ఉన్నాయి. ఇవన్నీ చేరి బిగ్ బాస్ కథ కంచికి చేరేలా ఉంది పరిస్థితి.

తప్పుకుంటున్న టాప్ బ్రాండ్లు…
బిగ్ బాస్ అన్ని సీజన్స్ గమనిస్తే ఒక సీజన్ లో ఉన్న బ్రాండ్లు మరో సీజన్లో లేవు ప్రతిసారి మారిపోతున్నాయి. అయితే ఈ సీజన్ లో అయితే చాలా మటకు బ్రాండ్లు తప్పుకుంటున్నాయి దీనికి కారణం బిగ్ బాస్ షోలో పస లేకపోవడమే. ఇక నాగార్జున కర్ర విరగకూడదు, పాము చావాలి అన్న చందంగా ఏదో అలా తిట్టీ తిట్టనట్టు కాంటెస్టెంట్లను తిట్టడం ఇవన్నీ షో మీద ఇంట్రెస్ట్ తగ్గిస్తున్నాయి. ఒక కంటెస్టెంట్ తప్పు చేస్తే అతన్ని మందలించాలని చూసే ప్రేక్షకుడు కోరుకుంటాడు కానీ నాగార్జున కి స్క్రిప్ట్ ఎవరు ప్రిపేర్ చేస్తారో ఏమో కానీ ప్రేక్షకడు కోరుకున్నట్లు మాత్రం ఎపిసోడ్ లో ఫైర్ ఉండదు.

ఇక ఎపిసోడ్స్ లో టాస్కులు రొటీన్ రొట్టలాగ ఉండటం, ఇక కంటెస్టెంట్లు కూడా మా డబ్బు మాకు వస్తుంది అనట్లుగా గేమ్ ఆడుతున్నారు. ఇవన్నీ బిగ్ బాస్ చూసే ప్రేక్షకుడికి ఎంటర్టైన్మెంట్ ఇవ్వక బోర్ కొట్టించేస్తున్నాయి. దానికి తోడు 24 గంటలు వాళ్ళేం చేస్తున్నారో చూసే అవకాశం ప్రేక్షకుడికి ఇవ్వడం వల్ల రేటింగ్స్ కి అది కూడా మైనస్ అయింది. మొత్తానికి బిగ్ బాస్ షో ఫెయిల్యూర్ వల్ల నాగార్జున కి బ్యాడ్ నేమ్ వస్తుందని ఆయన అభిమానులు బాధపడుతున్నారు.