Big boss season 6 : ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసే రియాలిటీ షో బిగ్ బాస్ కొత్త సీజన్ మొదలవబోతోంది. కొత్త ప్రోమోతోనే షో మీద ఇంట్రస్ట్ పెంచేసాడు కింగ్ నాగార్జున. ఇక బిగ్ బాస్ లవర్స్ ఫుల్ బిజీ కానున్నారు. ఇక అపుడే షోలో ఎవరెవరు కంటెస్టెంట్స్ గా రాబోతున్నారని నేటింట్లో వెతుకులాట మొదలుపెట్టేసారు. ఇక ప్రోమోలో అప్పగింతల వరకు ఆగలేక పోయారు అంటే అక్కడ ఆట మొదలైనట్లుంది అంటూ సాగే ప్రోమో లో ఏ ఈవెంట్ అయినా బిగ్ బాస్ తరువాతే అంటూ నాగార్జున చెప్పిన డైలాగు అదిరింది. అయితే ఇప్పుడు కాంటెస్టెంట్స్ ఎవరై ఉంటారా అనేదే ఎక్కువ ఆసక్తిని రేపుతున్న విషయం.
హాట్ కంటెస్టెంట్స్ తో ఫుల్ ఎంటర్టైన్మెంట్…

బిగ్ బాస్ లో గొడవలు, ప్రేమలు, స్నేహాలు బాగా పాపులర్ అవుతాయి. అలాగే కొంచెం కాంట్రావెర్సీ ఉన్న వాళ్ళు షోలో పాల్గొంటే ఇక ఆట రసవత్తరంగా మారుతుంది. అందుకే షో మొదలవుబోతోంది అనగానే ప్రేక్షకులు కంటెస్టెంట్లు ఎవరున్నారా అని ఆరా తీయడం మొదలు పెడతారు. ఇక ఎప్పటి లాగే బిగ్ బాస్ సీజన్ 6 లో కూడా సినిమా, టీవీ రంగానికి చెందిన వాళ్ళను, అలాగే సోషల్ మీడియాలో బాగా పాపులర్ ఐన వాళ్ళను సెలెక్ట్ చేసింది బిగ్ బాస్ యాజమాన్యం. ఇక ఎవరు కామన్ వ్యక్తులు ఉండబోతున్నారని సమాచారం. మొత్తం సభ్యులు 19 కాగా 15 మంది షో ప్రారంభం అయ్యాక వెళ్తారు. ఇక మిగిలిన వాళ్ళు వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి అడుగుపెడతారు.
ఇక లిస్ట్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో హాట్ ఫేవరెట్ ఉదయభాను. టీవీ లో యాంకర్ గా, సినిమాల్లో ను నటించి ఎంతో మంది ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్న అలనాటి యాంకర్ ఉదయభాను బిగ్ బాస్ లోకి అడుగుపెట్టబోతోందని వార్తలు వస్తున్నాయి. సెకండ్ ఇన్నింగ్స్ ఇప్పటికే పలు షోస్ లో కనువిందు చేస్తున్న ఉదయభాను యూట్యూబ్ చేసనెల్ ద్వారా ప్రేక్షకులకు మళ్ళీ దగ్గరైంది. ఇక నెక్స్ట్ కంటెస్టెంట్ నేహా చౌదరి. మా మ్యూజిక్ యాంకర్ గా పనిచేసిన నేహా ఐపీల్ మ్యాచ్ లు చూసేవారికి బాగా పరిచయస్తురాలే. ఇక నేహా చౌదరి సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటూ ఎంతో మంది ఫాలోయర్స్ ని కలిగి బిగ్ బాస్ టైటిల్ ఫేవరెట్ గా ఉంది. ఇక లిస్ట్ లో చలాకి చంటి పేరు కూడా వినిపిస్తోంది. అదే నిజమైతే ఎంటర్టైన్మెంట్ ఈ సారి సీజన్ లో బాగా ఉంటుంది. కానీ జబర్దస్త్ వదిలి బిగ్ బాస్ వచ్చినపుడు అవినాష్ 10 లక్షలు కట్టనని చెప్పాడు మరి అలాంటి రిస్క్ చలాకి చంటి చేస్తాడో లేదో తెలియదు.

ఇక చంటి మాత్రమే కాదు జబర్దస్త్ వాళ్ళు జబర్దస్త్ అప్పారావు, గలాటా గీతూ కూడా బిగ్ బాస్ లో పాల్గొంటున్నట్లు సమాచారం. అప్పారావు జబర్దస్త్ మానేసి ఇప్పుడు ఇతర చానెల్స్ లో వస్తున్నాడు. ఇక గలాటా గీతూ తన యాసతో రీల్స్ ద్వారా బాగా ఫేమస్ అయి జబర్దస్త్ లో స్కిట్స్ చేసి మరింత గుర్తింపు తెచ్చుకుంది. మరి వీళ్ళు ముగ్గురు బిగ్ బాస్ లో ఉంటే మాత్రం మంచి ఎంటర్టైన్మెంట్ వస్తుంది. ఇక లాస్ట్ సీజన్ లో వచ్చిన సిరి బాయ్ ఫ్రెండ్ శ్రీహన్ ఈ సీజన్ లో ఎంట్రీ ఇవ్వనున్నాడు. లాస్ట్ సీజన్ లో జరిగిన ఇష్యూ వల్ల శ్రీహన్ కి బాగా సింపతీ ఉంది అలా ఇతను టైటిల్ ఫేవరెట్ గా ఉన్నాడు. ఇక యూ ట్యూబ్ లో బిగ్ బాస్ రివ్యూ చెప్పే ఆదిరెడ్డి అలియాస్ బొడ్డు వెంకట నారాయణ కూడా ఈ సీజన్ లో బిగ్ బాస్ ఇంట్లోకి అడుగుపెట్టబోతున్నాడు. ఆది రెడ్డి కి యూట్యూబ్ ఛానెల్ ద్వారా మంచి ఫాలోయింగ్ ఉంది. బిగ్ బాస్ రివ్యూస్ ద్వారా లక్షల్లో ఫాలోయర్స్ ను సంపాదించాడు. షో గురించి రివ్యూ ఇచ్చే ఆది రెడ్డి షో లో ఎలా ఉంటాడో చూడాలి. ఇక మిగిలిన కంటెస్టెంట్స్ గురించి క్లారిటీ రావాలి. అయితే మొత్తంగా 25 మందిని బిగ్ బాస్ కి సెలెక్ట్ చేసి అందులో 15 మందిని లోపలికి పంపుతారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళే కంటెస్టెంట్స్ అని షో మొదలయ్యే వరకు సస్పెన్స్ ఉంటుంది.


































