Big boss Vasanthi Krishnan : మోడలింగ్ తో మొదలై, కన్నడ సినిమాలను చేసి మళ్ళీ తెలుగు సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువైన తెలుగమ్మాయి వాసంతి కృష్ణన్. తిరుపతికి చెందిన వాసంతి ప్లస్ టూ తరువాత డిగ్రీ కోసం బెంగళూరు వెళ్లి పైలట్ అవ్వాలని అనుకుంది. ఆ తరువాత యాక్టింగ్ కెరీర్ వైపు అడుగులేసి కన్నడ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. మోడలింగ్ చేస్తూ ఆ తరువాత సినిమాల్లో హీరోయిన్ గా కొన్ని కన్నడ సినిమాలు చేసిన వాసంతి తెలుగు ఇండస్ట్రీకి మా టీవీ ద్వారా అడుగుపెట్టింది. తెలుగులో సిరిసిరి మువ్వ, గుప్పెడంత మనసు సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక బిగ్ బాస్ సీజన్ 6 లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన వాసంతి బిగ్ బాస్ తరువాత లైఫ్ మారి పోయిందని చెప్తుంది. తాజగా ఎంగేజ్మెంట్ చేసుకుని అందరికీ షాకిచ్చింది వాసంతి.

ఎంగేజ్మెంట్ చేసుకుంటున్న వాసంతి… పెళ్లి త్వరలో…
బిగ్ బాస్ ద్వారా బాగా గుర్తింపు తెచ్చుకున్న వాసంతి ప్రస్తుతం అటు సినిమాలు ఇటు బుల్లితెర మీద షోస్ తో సందడి చేస్తోంది. ప్రస్తుతం బిబి జోడితో సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ త్వరలో పెళ్లి చేసుకోబోతోంది. తాజాగా తిరుపతిలో ఘనంగా ఎంగేజ్మెంట్ చేసుకుంది. డిసెంబర్ 7న తిరుపతి లోని హోటల్ తాజ్ లో చేసుకుంది.

కాబోయే వరుడు పవన్ కళ్యాణ్ కూడా సినిమాల్లో నటిస్తున్నాడు. ఇప్పటికే రెండు సినిమాల్లో హీరోగా చేసిన పవన్, వాసంతి తో ఏడాదిగా రిలేషన్ లో ఉన్నాడు. ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన పవన్ ను పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుంటోంది. ఇక ఈ వేడుకకు బిగ్ బాస్ లో తన స్నేహితులైన బుల్లితెర సెలబ్రిటీస్ ఆర్జే సూర్య, శ్రీ సత్య, అర్జున్ కళ్యాణ్, ఇనయ సుల్తానా హాజరయ్యారు.

































