Big boss Vasanthi Krishnan : మోడలింగ్ తో మొదలై, కన్నడ సినిమాలను చేసి మళ్ళీ తెలుగు సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువైన తెలుగమ్మాయి వాసంతి కృష్ణన్. తిరుపతికి చెందిన వాసంతి ప్లస్ టూ తరువాత డిగ్రీ కోసం బెంగళూరు వెళ్లి పైలట్ అవ్వాలని అనుకుంది. ఆ తరువాత యాక్టింగ్ కెరీర్ వైపు అడుగులేసి కన్నడ ఇండస్ట్రీ లో అడుగుపెట్టింది. మోడలింగ్ చేస్తూ ఆ తరువాత సినిమాల్లో హీరోయిన్ గా కొన్ని కన్నడ సినిమాలు చేసిన వాసంతి తెలుగు ఇండస్ట్రీకి మా టీవీ ద్వారా అడుగుపెట్టింది. తెలుగులో సిరిసిరి మువ్వ, గుప్పెడంత మనసు సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక బిగ్ బాస్ సీజన్ 6 లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన వాసంతి బిగ్ బాస్ కి ముందు తన ఇంటర్వ్యూలో ‘వాంటెడ్ పండుగాడ్’ సినిమా గురించి అలాగే సుధీర్ గురించి మాట్లాడింది.

సుధీర్ చాలా కామ్… తన ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుది కాదు…
సుధీర్ సినిమా వాంటెడ్ పండుగాడ్ లో నటించిన వాసంతి ఆ సినిమాలో సుధీర్ కి జోడిగా కాకుండా, శ్రీనివాస్ రెడ్డి గారికి జోడిగా నటించింది. ఇక షూటింగులో సుధీర్ ఎలా ఉండేవాడు అంటూ చెప్పింది. సుధీర్ తో కాంబినేషన్ సీన్స్ ఏమీ లేకపోవడం వల్ల తన గురించి ఎక్కువ తెలియదని చెప్పిన వాసంతి ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో తనను కలిసానని చాలా కామ్ గా ఉంటాడు అని చెప్పింది.

అందరినీ గౌరవించడం వల్లే తనకు అంత మంచి పేరు ఉంది. అతను ప్లే బాయ్ లాగా అసలు కనిపించలేదు. అతనికి అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందంటే అది అతని బిహేవియర్ వల్లే అంటూ చెప్పింది. అంత ఫాలోయింగ్ ఉండటంలో తప్పేం లేదంటూ సుధీర్ పొగడ్తలతో ముంచేసింది వాసంతి కృష్ణన్.

































