Big Boss : బిగ్ బాస్ ప్రోగ్రాం తెలియని వారు కూడా వుంటారా అంటే అది అతిషయోక్తి కాదు. అంతలా బిగ్ బాస్ అందరికి చేరువ అయ్యింది. తెలుగు బుల్లితెర చరిత్రలోనే భారీ స్థాయిలో స్పందనను సంపాదించుకుని. దేశంలోనే అత్యధికంగా టీఆర్పీ రేటింగ్ రాబడుతున్న బిగ్గెస్ట్ రియాలిటీ షోగా బిగ్ బాస్ రానిస్తోంది. తెలుగులో బిగ్ బాస్ ఇప్పటికే ఐదు సీజన్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్బంగా ఈ షోను ఇప్పుడు ఓటీటీలో కూడా ప్రసారం చేస్తున్నారు. సాధారణంగా టీవీ ప్రోగ్రాంకాకు వుండే సరిహద్దులంటూ ఏమి లేని కంటెంట్‌తో బిగ్ బాస్ అభిమానులకు వినోదాన్ని పంచుతోందీ.

ఈ ఓటీటీ బిగ్ బాస్ కి కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహారిస్తున్నారు. మొదట 17 మంది కంటెస్టెంట్ లతో ప్రారంభమైన ఈ ఓటీటీ బిగ్ బాస్ కార్యక్రమంలో ప్రస్తుతం ఏడుగురు కంటెస్టెంట్ లు ఉన్నారు. ఈ ఏడుగురిలో బిందుమాధవి ఇంకా అఖిల్ మధ్య టైటిల్ పోరు కూడా నడుస్తోంది. ఫినాలేకు ముందు జరిగే ఎలిమినేషన్ ప్రక్రియకు సంబందించిన లీకులు బయటకు వచ్చాయి. ప్రస్తుతం ఈ ప్రోగ్రాం లో ఏడు మంది కంటెస్టెంట్ లు ఉండగా శుక్రవారం ఒకరిని, శనివారం ఒకరిని బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు పంపిస్తున్నట్లు సమాచారం. అలాగే ఆదివారం జరిగే గ్రాండ్ ఫినాలే లో విజేతను ప్రకటిస్తారు. అంతే కాదు లీకుల ప్రకారం చివరి కంటెస్టెంట్లు గా బాబామాస్టర్ ఇంకా అనీల్ బిగ్ బాస్ హౌస్ నాన్‌స్టాప్ షోకి ఎలిమినేట్ అవుతున్నారట. అంటే టాప్ 5 లిస్ట్ లో బాబా, అనీల్ ఉండరని వార్తలు వస్తున్నాయి.
రామ్ చరణ్ హోస్ట్ గా చేస్తున్నారా……

అయితే ఈ కార్యక్రమానికి సంబందించిన గ్రాండ్ ఫినాలే మూడు రోజుల పాటు ఘనంగా జరుగుతుందని సమాచారం. శుక్రవారం నుంచి ఆదివారం వరకు ఈ వేదుకాలు జరుగుతాయట. అయితే తాజా సమాచారం ప్రకారం బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే రోజున జరిగే కార్యక్రమానికి హోస్ట్ గా నాగార్జున డుమ్మా కొట్టినట్లు సమాచారం. నాగార్జున గ్రాండ్ ఫినాలే కార్యక్రమానికి హోస్ట్ గా అందుబాటులో ఉండకపోతే ఈయన స్థానంలోకి హీరో వెంకటేష్ లేదా హీరో రామ్ చరణ్ హోస్ట్ గా బాధ్యతలు నిర్వహిస్తారని తెలుస్తోంది. అయితే వీరిద్దరిలో కూడా దాదాపుగా రామ్ చరణ్ ఈ గ్రాండ్ ఫినాలే కి హోస్ట్ గా వ్యవహరిస్తారని వార్తలు. గ్రాండ్ ఫినాలేలో ఎక్కువ మొత్తం రామ్ చరణ్ సందడి చేస్తారని సమాచారం. ఇక దీనిపై మరి కొద్ది గంటలలో అభిమానుల లోని ఆతృతకు చెక్ పడుతుంది.



























