Featured

బిగ్ బాస్ 5 ఫైనల్ లిస్ట్ వచ్చేసింది… కంటెస్టెంట్ లు ఎవరంటే?

బుల్లితెరపై మరి కొద్ది రోజులలో ప్రసారం కానున్న బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమం గురించి రోజురోజుకు ప్రేక్షకులలో తీవ్ర ఉత్కంఠత నెలకొంది. ఈ కార్యక్రమం వచ్చే నెల 5వ తేదీ నుంచి ప్రసారంకానున్నట్లు పెద్దఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో కూడా నిర్వాహకులు తాజాగా విడుదల చేశారు. గత రెండు సీజన్ల మాదిరిగానే ఈ సీజన్ కి కూడా హోస్ట్ గా నాగార్జున వ్యవహరిస్తున్నట్లు విడుదల చేసిన ప్రోమో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.

ఇకపోతే ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే కంటెస్టెంట్ లు వీళ్లే అంటూ కొందరి పేర్లు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వినబడుతున్నాయి. తాజాగా బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొన్నబోయేవారి ఫైనల్ లిస్ట్ ఇటీవలే బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ లిస్టులో ఎవరెవరు ఉన్నారంటే..

బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో పాల్గొనబోయే కంటెస్టెంట్ లలో యాంకర్ రవి, సీరియల్ నటి సిరి హనుమంత, సీనియర్ ఆర్టిస్ట్ ప్రియా, కార్తీకదీపం ఉమా, జస్వంత్, సిరి, ఆర్ జే కాజల్, tv9 ప్రత్యూష, నటుడు విశ్వ, నిఖిల్, సన్నీ, లోబో, యూట్యూబర్ షణ్ముఖ జస్వంత్, సరయు, లహరి, శ్వేతా వర్మ వంటి వారి పేర్లు ఈ లిస్టులో ఉన్నాయి.

ఈ సీజన్ లో పాల్గొనే కంటెస్టెంట్ లు 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండి, కరోనా నిర్ధారణ పరీక్షలు చేసిన అనంతరం హౌస్ లోనికి వెళ్లనున్నారు. అదేవిధంగా హౌస్ లోకి వెళ్లే ప్రతి ఒక్క కంటెస్టెంట్ కూడా రెండు డోస్ ల వ్యాక్సిన్ తప్పనిసరిగా వేసుకున్నాకనే కంటెస్టెంట్ లను లోపలికి పంపించనున్నారు. ఈ క్రమంలోనే ఈ కంటెస్టెంట్స్ అందరిని ఆగస్టు 22వ తేదీన క్వారంటైన్ కి పంపించి, అక్కడి నుంచి సరాసరి బిగ్ బాస్ హౌస్ లోనికి ప్రవేశ పెట్టనున్నట్లు తెలుస్తోంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

2 hours ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

2 hours ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

3 hours ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

20 hours ago

పేద దేశాల నుంచి వలసలకు బ్రేక్.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. అమెరికా భవిష్యత్తుపై ఆందోళన

అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…

20 hours ago

మన బట్టలపై కనిపించే S, M, L సైజ్ ట్యాగ్ వెనుక భారీ చరిత్ర..

ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…

21 hours ago