Featured

కళాతపస్వి కె.విశ్వనాథ్ తన “సినీ కాంపౌండ్” దాటి తీసిన సినిమా ఏంటో తెలుసా ?!

సినీ పరిశ్రమలో సినిమా పేరు చెప్పగానే.. దాని దర్శకుడు ఎవరో దాదాపుగా చెప్పేయవచ్చు. పౌరాణిక చిత్రాలంటే కమలాకర కామేశ్వరరావు, జానపద చిత్రాలంటే విటలాచార్య, యాక్షన్ చిత్రాలంటే కే.ఎస్.ఆర్.దాస్, కళాత్మక చిత్రాలంటే కె.విశ్వనాథ్. ఇలా ఒక్కో దర్శకుడికి ఒక్కో రకమైన బ్రాండ్ ఇమేజ్ ఉంది. సిరిసిరిమువ్వ, శంకరాభరణం, సాగర సంగమం, సిరివెన్నెల, స్వయంకృషి, స్వాతిముత్యం, స్వాతి కిరణం ఈ సినిమా పేర్లు చెప్పగానే ఎవరైనా టక్కున చెప్పేపేరు కె.విశ్వనాథ్.

ఆయన తీసిన కళాత్మక చిత్రాలు ఖండాంతరాలకు వ్యాపించి అనేకమంది ప్రేక్షకాభిమానులను ఆయన సంపాదించుకోగలిగారు. ఆయనా తీసే చిత్రాలకు అవార్డులు దాసోహం అన్నాయి. తెలుగు సాహిత్యాన్ని, సంగీతాన్ని మేళవించి తీసిన చిత్రాలు అజ్ఞానమనే అంధకారంలో ఉన్న ప్రతి ఒక్కరిని మేల్కొలిపాయి.

1976 గీతాకృష్ణ కంబైన్స్, కె.విశ్వనాథ్ దర్శకత్వంలో “సిరిసిరిమువ్వ” చిత్రం విడుదలయింది. ఈ సినిమాలో చంద్రమోహన్, జయప్రద హీరో, హీరోయిన్లుగా నటించారు. నాట్యాన్ని ప్రధానంశంగా చేసుకొని వచ్చిన ఈ సినిమా కళాతపస్వి రూపొందించిన చాలా చిత్రాలకు మొదటి అడుగుగా చెప్పుకోవచ్చు.

1980, ఏడిద నాగేశ్వరరావు నిర్మాణం, కె.విశ్వనాథ్ దర్శకత్వంలో “శంకరాభరణం” చిత్రం విడుదలైంది. ఈ సినిమాలో సోమయాజులు ప్రధాన పాత్ర పోషించారు. శంకరాభరణం శంకరశాస్త్రి గానాన్ని ప్రాణంగా భావించి, తన జీవితాన్ని కొనసాగించే పాత్రలో సోమయాజులు సినిమా మొత్తం తానే నటించారనేకంటే నడిపించారనడం సమంజసం. ఇలా సాగర సంగమం, సిరివెన్నెల, స్వర్ణకమలం లాంటి అనేక చిత్రాలు కళలను ఆధారంగా చేసుకుని కె. విశ్వనాథ్ మనసుపెట్టి రూపొందించారు.

కానీ ఈ చిత్రాల కంటే ముందు 1978లో శోభన్ బాబు, కైకాల సత్యనారాయణలను ప్రధాన పాత్రలో “కాలాంతకులు” అనే చిత్రాన్ని కె.విశ్వనాధ్ నిర్మించారు. “కాలాంతకులు” చిత్రానికి దర్శకుడు కె.విశ్వనాథ్ అంటే దాదాపుగా ప్రేక్షకులు ఎవరూ నమ్మరు.

ఒక విధంగా చెప్పాలి అంటే కె.విశ్వనాథ్ తన సినీ కాంపౌండ్ దాటి తీసిన చిత్రంగా “కాలాంతకులు” చిత్రాన్ని పేర్కొనవచ్చు. తాను రూపొందించిన చిత్రాలకు భిన్నంగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద పరాజయం పొందింది.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకండి.. ఈ సులభమైన చిట్కాలతో మళ్లీ తాజాగా మార్చుకోవచ్చు

తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…

8 hours ago

హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్ కింద వాటర్ బాటిల్ వేయాలంటున్నారు.. కారణం ఏమిటో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…

9 hours ago

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

16 hours ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

16 hours ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

17 hours ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

1 day ago