Categories: FeaturedMovie News

ఆ వీడియోలను చూపిస్తూ రవి బండారం బయటపెట్టిన బిగ్ బాస్…

బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ కార్యక్రమం మూడు వారాలు పూర్తి చేసుకోనుంది. అయితే ఇప్పటివరకు కంటెస్టెంట్ లు ఏ స్థాయిలో గొడవపడిన బిగ్ బాస్ వారి గురించి పట్టించుకోకుండా ఉన్నారు. అయితే నేడు ప్రసారమయ్యే ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమో చూస్తుంటే నాగార్జున కంటెస్టెంట్స్ అందరిని దారిలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.

ముఖ్యంగా ఈ వారం నామినేషన్ ప్రక్రియలో భాగంగా పెద్ద ఎత్తున గొడవలు జరిగిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా లహరి -రవి-ప్రియా మధ్య జరిగిన గొడవ పై నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. లహరి రవి అర్ధరాత్రి బాత్ రూమ్ దగ్గర హగ్ చేసుకున్నారన్న మాటలకు కంటెస్టెంట్ అందరూ షాక్ అవ్వడమే కాకుండా ఈ విషయం గురించి వీరి ముగ్గురి మధ్య చిన్నపాటి యుద్ధమే జరిగిందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ప్రియా అన్న మాటలు తమకు నచ్చలేదంటూ హౌస్ సభ్యులందరూ ఆమెను నామినేట్ చేశారు.

రవి ప్రియ దగ్గరికి వెళ్లి లహరి యాంకరింగ్ కోసం ట్రై చేస్తోంది అందుకే నేను ఎక్కడికి వెళ్ళినా నా వెనకాలే వస్తుంది.. తనకి ఎలా చెప్పాలో తెలియడం లేదంటూ ప్రియా దగ్గర చెబుతాడు అదే మాటలను ప్రియా చెప్పగా లహరి రవి కోపంతో తన పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ గొడవకు దిగుతారు. ఇదే విషయమే లహరి రవిని ప్రశ్నించగా నేను అలా అనడం లేదంటూ అబద్ధం చెప్పడంతో నెటిజన్లు రవి డబుల్ గేమ్ అడుగుతున్నాడు అంటూ పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు.

తాజాగా విడుదలైన ప్రోమోలో భాగంగా నాగార్జున వీరి ముగ్గురికి ప్రత్యేకంగా వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ముందుగా హగ్ చేసుకోవడం అంటే బిజీగా ఉన్నట్టా అంటూ ప్రియను ప్రశ్నిస్తాడు. ఆ తర్వాత రవిని నువ్వు సింగిల్ మెన్ అన్నావా? అని అనడంతో రవి అన్నాను సర్ అని ఒప్పుకుంటాడు. ఆ తర్వాత నిజానిజాలేమిటో బిగ్ బాస్ లహరిని పవర్ రూమ్ కి పంపించి వీడియోలను ప్లే చేసి చూపిస్తాడు. ఈ క్రమంలోనే క్లారిటీ వచ్చింది కదా అంటూ లహరిని అడిగి ఎవరిది తప్పు లేదో బయటకు వెళ్లి వారిని హగ్ చేసుకో… మరి బయటకు వెళ్లిన లహరి ప్రియకు మద్దతు తెలుపుతుందా..?లేక రవికి మద్దతు తెలుపుతుందా..? అనేది తెలియాల్సి ఉంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

తిరుమల శ్రీవారి సేవకు.. కృష్ణయ్య, పురాణపండలకు ఎన్ని జన్మల పుణ్యమిది..

హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…

4 hours ago

మార్చి 3 చంద్రగ్రహణ ప్రభావం.. జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందులే!

2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…

7 hours ago

మేడి పండులో నిజంగానే పురుగులుంటాయా? అసలు నిజం ఇదే!

“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…

7 hours ago

వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ? క్లారిటీ ఇచ్చిన కవిత:

తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…

7 hours ago

తెలంగాణ విమానయాన రంగంలో మరో అడుగు.. ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు కేంద్ర గ్రీన్ సిగ్నల్:

తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…

9 hours ago

నెలసరి నొప్పులతో బాధపడుతున్నారా? ఈ నేచురల్ జ్యూస్ ట్రై చేయండి!

నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…

10 hours ago