బిగ్ బాస్ కార్యక్రమం చివరి దశకు చేరుకోవడంతో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ క్రమంలోనే సిరి షణ్ముఖ్ వ్యవహారం కూడా శృతి మించిపోయిందని పెద్ద ఎత్తున నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.సిరి కేవలం తన సొంతమని తనపై పెత్తనం చెలాయిస్తూ తన ఆధీనంలో ఉంచుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు షణ్ముఖ్.

ఈ విషయం ఎంతో మంది నెటిజన్లు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ విషయంపై నటి మాధవిలత స్పందిస్తూ సిరి పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ షణ్ముక్ తీరును తప్పుపడుతూ సిరి పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సిరిది సిగ్గులేని జన్మ అవకాశాలకోసం అంత దిగజారుడు బతుకు అంత తిట్టిన తనతో స్నేహం ప్రేమ అంటూ తన సేవలో మునిగిపోయింది.

షణ్ముఖ్ ఎంతో ఓపెన్ గా తన తల్లిని అవమానించిన ఇటు తన తల్లిని, తన పార్ట్‌నర్‌ను లెక్క చేయని పద్ధతి గల మంచి అమ్మాయి సిరి ఆమెను షణ్ముఖ్ ఎంత బాధ పెట్టిన అతనిని కన్నా అని పిలుస్తుంది అదే తన కాబోయే వాడిని మాత్రం చోటు అంటూ పిలుస్తుందని మాధవి లత తెలిపారు.

ఇంట్లో సన్నీ శ్రీరామ్ కామపిశాచి బాడీగార్డ్ అందుకే సిరి హగ్ కోసం వాళ్ళు తల్లడిల్లిపోతున్నారు. అందుకే హౌస్ లో ఉన్న వారందరినీ అన్నయ్య అని పిలిపించాడు. అన్నయ్య అని ఎలా పిలిపిస్తాడు అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫినాలే దగ్గరపడుతున్న నేపథ్యంలో వీరి వ్యవహారశైలి అందరికీ విసుగు తెప్పించడంతో ముందుగా వీరిని హౌస్ నుంచి బయటకు పంపిస్తే సగం దరిద్రం పోతుంది అంటూ మరెంతో మంది నెటిజన్లు వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.






























