బిగ్ బాస్ హౌస్ లో ఆదివారం ఈ కార్యక్రమం ఎంతో ఉత్సాహంగా కొనసాగింది. నాగార్జున రావడం రావడంతోనే హౌ సభ్యులకు గంగవ్వ గృహప్రవేశం ఆమె కొత్త ఇల్లు వీడియో చూపించి చూపించి అందరినీ సంతోష పరిచారు.ఇక అనంతరం నిన్న చిల్డ్రన్స్ డే కావడంతో హౌస్ సభ్యులను రెండు టీమ్స్ గా విభజించి వారితో స్కూల్లో పిల్లల చేత ఆడించే ఆటలు ఆడించారు. అనంతరం ఈ గేమ్లో ఓడిపోయిన వారికి పనిష్మెంట్ కూడా ఇచ్చారు.
ఇలా ఆదివారం కార్యక్రమం ఎంతో సరదాగా సాగింది. అయితే చివరికి హౌస్ నుంచి ఎవరో ఒక కంటెస్టెంట్ తప్పకుండా బయటకు వెళ్లాల్సి ఉంటుంది కనుక ఈ వారం చివరిలో మానస్, కాజల్ మిగిలి ఉండగా వీరిద్దరిలో ఎవరో ఒకరు బయటకు వెళ్తారని అందరూ భావించారు. అయితే ఓట్ల పరంగా కాజల్ కి తక్కువ ఉండడంతో ఈ వారం తప్పకుండా కాజల్ బయటకు వస్తుందని అందరూ భావించారు.
అయితే ఎవరూ ఊహించని విధంగా కాజల్ సేఫ్ జోన్ లోకి వెళ్లి ఎవరూ ఊహించని విధంగా హౌస్ నుంచి ఈ వారం జెస్సీ బయటకు వచ్చారు. అనారోగ్యం కారణంగా సీక్రెట్ రూమ్ లో ఉంటూ ట్రీట్మెంట్ చేయించుకున్న జెస్సీ అనారోగ్య పరిస్థితి మరింత దారుణంగా కావడంతో అతనిని తప్పని పరిస్థితులలో హౌస్ నుండి బయటకు పంపించాల్సి వచ్చింది.
ఈ క్రమంలోనే జెస్సి సీక్రెట్ రూమ్ లో నుంచి బయటకు వచ్చి హౌస్ లో తన జర్నీ చూసుకుంటూ ఎంతో బాధతో భారంతో బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చారు. బిగ్ బాస్ వేదికపై జెస్సీ మాట్లాడుతూ హౌస్ లో కంటెస్టెంట్ లకు పలు సూచనలు చేశాడు. జెస్సీ కాజల్ ను సేవ్ చేసి బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లకు వీడ్కోలు చెప్పి బయటకు ఎంతో బాధతో బయటకు వచ్చారు.
ఇటీవలి కాలంలో గుండెపోటు ఘటనలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా యువతిలో కూడా ఈ సమస్య కనిపించడం వైద్య నిపుణులను ఆందోళనకు గురిచేస్తోంది.…
ఆధునిక జీవనశైలిలో పరుగులు పెడుతున్న మనుషులకు ఆధ్యాత్మిక కథలు చిన్న విరామం లాంటివి. నేటి శుక్రవారం సందర్భంగా ఒక చిన్న…
పల్నాడు జిల్లా మాచర్లలో సంచలనం రేపిన యువతి అనుమానాస్పద మృతి కేసులో మిస్టరీ వీడింది. మొదట ఆత్మహత్యగా భావించిన ఈ…
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’ విడుదల తేదీపై మరోసారి అనిశ్చితి నెలకొనడంతో అభిమానుల్లో చర్చ కొనసాగుతోంది.…
శుక్రవారం రోజు హిందూ సంప్రదాయంలో ప్రత్యేకమైన స్థానం కలిగిన రోజు. ముఖ్యంగా లక్ష్మీదేవిని ఆరాధించేందుకు ఈ రోజు ఎంతో శుభప్రదంగా…
మహిళల్లో పెరుగుతున్న ఆరోగ్య సమస్యల్లో ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్న పేరు “పీసీవోఎస్” (PCOS). జీవనశైలి మార్పులు, ఆహార అలవాట్లు, ఒత్తిడి…