బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ టాస్క్ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ మానస్ కి ఒక టాస్క్ ఇస్తాడు. తాను ఎంపిక చేసుకున్న వారితో న్యూడిల్స్ తినే పోటీ పెట్టుకుంటారు. ఈ టాస్క్ లో భాగంగా మానస్ సన్నీని ఎంపిక చేసుకోవడంతో సన్నీ ఎక్కువ నూడుల్స్ తిని టాస్క్ లో గెలుస్తాడు. ఈ క్రమంలోనే సన్నీకి ఐదు ఎక్స్ట్రా ఎగ్గులు లభిస్తాయి. ఇక ఎగ్స్ టాస్క్ లో మానస్, విశ్వ, సన్నీ, శ్రీరామ్, రవి ఎక్కువ ఎగ్స్ తో కెప్టెన్సీ పోటీ దారులుగా అర్హత సాధించినట్లు బిగ్ బాస్ ప్రకటిస్తాడు.
అందరూ హౌస్ నుంచి లోబో ఎలిమినేట్ అయ్యారని భావిస్తుండగా అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ సీక్రెట్ రూమ్ నుంచి తిరిగి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ చేయడానికి ఏర్పాట్లు చేస్తారు. ఇలా హౌస్ లోకి పంపించే లోబోతో ఒకటి గోల్డెన్ ఎగ్ మరొకటి బ్లాక్ పంపిస్తారు. బ్లాక్ ఎగ్ ఇచ్చేవారు కెప్టెన్సీ పోటీదారులుగా అనర్హులని ప్రకటించారు. అలాగే గోల్డెన్ ఎగ్ ఇచ్చేవారి అర్హత సాధిస్తారు. అలా లోబో బ్లాక్ ఎగ్ శ్రీ రామ్ కి ఇవ్వగా గోల్డెన్ ఎగ్ కాజల్ కి ఇస్తారు.
మరోవైపు సిరి జెస్సి షణ్ముక్ ముగ్గురు మాట్లాడుతూ తనని నమ్మక ద్రోహం చేశారని,అందరి ముందు తనని ఒక ఎదవగా నిలబెట్టారు అంటూ షణ్ముఖ వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కనీసం వారితో మాట్లాడటానికి కూడా ఇష్టపడడు. బిగ్బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్క్ లో సిరికి బదులు నన్ను తీసుకోవచ్చుగా అంటూ జేస్సీతో గొడవ పడతాడు.ఇద్దరు కలిసి నన్ను వాడుకున్నారు అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ భోజనం చేయకుండా వెళ్ళిపోతాడు.
ఇక సిరి కూడా భోజనం చేయకుండా షణ్ముక్ అన్న మాటలకు బాధపడుతుంది.సీక్రెట్ టాస్క్ లో సిరిని ఎంపిక చేసుకోవడానికి కారణం ఏమిటి అనే విషయం గురించి వివరణ ఇస్తున్నప్పటికీ షణ్ముఖ వినకుండా.. సిగ్గు లేకుండా నన్ను దిగజార్చారు అంటూ తిట్టి వెళ్ళిపోతాడు. దీంతో ఎంతో కోపం చేసుకున్న సిరి తన షర్ట్ విప్పి విసిరి కొట్టడం గమనార్హం.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…