Movie News

సమంత పరువు నష్టం కేసులో నేడు తీర్పును వెల్లడించనున్న కోర్టు..!

అక్కినేని నాగచైతన్య సమంత దంపతులు పలు కారణాల వల్ల విడిపోతున్నామని వారి విడాకులు ప్రకటన చేసిన తర్వాత సమంత గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొట్టాయి. సమంత ప్రవర్తన సరిగా లేకపోవడంతోనే నాగచైతన్య విడాకులు ఇచ్చాడని ఆమెకు ఎవరితోనో అఫైర్స్ ఉన్నాయంటూ అందుకే విడాకులు ఇచ్చారు అంటూ ఆమె గురించి దుష్ప్రచారం చేశారు.

ఈ క్రమంలోనే సమంత గురించి వస్తున్న ఈ వార్తలపై స్పందించిన ఆమె యూట్యూబ్ ఛానల్ పై కూకట్ పల్లిలో కోర్టులో పరువునష్టం దావా వేసింది. ఈ క్రమంలోనే ఈ కేసుపై విచారణ నిన్న జరగగా కోర్టు తీర్పును మాత్రం వెల్లడించలేదు. కోర్టు సమయం ముగిసిపోవడంతో ఈ కేసులో తీర్పును నేటికి వాయిదా వేసింది. ఈ క్రమంలోనే నేడు కోర్టు సమయం ముగిసేలోపు ఈ పిటిషన్ పై తీర్పును వెల్లడిస్తామని కూకట్ పల్లి కోర్టు తెలియజేసింది.

ఈ క్రమంలోనే సమంత పర్సనల్ లాయర్ బాలాజీ మాట్లాడుతూ సమంత నాగ చైతన్య ఇంకా విడాకులు తీసుకుని విడిపోలేదని కేవలం తీసుకుంటున్నట్లు ప్రకటన మాత్రమే ఇచ్చారు.ఈ లోగా ఆమె గురించి ఈ విధమైనటువంటి అసత్య వార్తలు ప్రచారం చేయడం ఎంతో విడ్డూరమని ఆయన ఆరోపించారు.సమంతను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ ఆమె గురించి లేనిపోని కథనాలు అన్నింటిని సృష్టించినట్లు బాలాజీ కోర్టుకు వివరించారు.

ఈ క్రమంలోనే తను పరువునష్టం దావా వేయడానికి బదులుగా క్షమాపణ కోరవచ్చు కదా అంటూ కోర్టు ప్రశ్నించింది. సెలబ్రిటీల వ్యక్తిగత వివరాలు పబ్లిక్ డొమైన్లో పెట్టేది వాళ్లే, చివరికి వారి పరువు నష్టం దావా వేయడం ఏంటి అంటూ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.మరి సమంత ఈ కేసు విషయంలో నేడు ఎలాంటి తీర్పు వస్తుందో వేచి చూడాలి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago