బిగ్ బాస్ సీజన్ 5 లో ఇద్దరు కంటెస్టెంట్లు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. మొదటి వారంలో సరయు బయటకు వస్తే.. రెండో వారంలో కార్తీక దీపం సీరియల్ ఫేమ్ ఉమాదేవి బయటకు వచ్చింది. అందులో ఉమాదేవి రెండు వారాలకు రూ. 1.60 లక్షలు తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆమె తన నోటి దురుసు కారణంగానే బయటకు వచ్చారని.. ఆమె మాట్లాడే మాటలు బయట ఫ్యామిలీ ఆడియన్స్ నచ్చలేదని అందుకు.. ఓట్లు ఎక్కువగా రాలేదని తెలిసిందే. ఇదంతా ఇలా ఉండగా.. ఆమెపై నెటిజన్లు ప్రస్తుతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఎందుకో తెలుసా.. బిగ్‌బాస్ షోలో గయ్యాళి గంపగా పేరు తెచ్చుకున్న ఉమాదేవి తాజాగా ఓ గొప్ప నిర్ణయం తీసుకుంది. తన రెమ్యునరేషన్‌ను ఓ మంచి పని కోసం వినియోగించింది. ఆమెకు పారితోషికంతో కింద ఇచ్చిన డబ్బుల్లో కొంత మొత్తాన్ని ఆమె బోన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న చిన్నారిని ఆదుకునేందుకు అందించింది. ఈ విషయం తెలిసిన నెటిజన్లు ఆమె దయా గుణానికి ప్రశంసిస్తున్నారు. ఆమెది గొప్ప మనసు అంటూ ఆకాశానికి ఎత్తుతున్నారు.
ఆమె గొంతు పెద్దదంటూ విమర్శించిన వారే.. ఆమె మనసు కూడా పెద్దది అంటూ ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు. చిన్నారికి ప్రాణం పోసిన ఉమాదేవికి అంతా మంచి జరగాలని కోరుకుంటున్నారు. మొదట్లో ఆమె బయటకు వచ్చినప్పుడు.. గయ్యాళి బయటకు వెళ్లింది అంటూ విమర్శించిన వారు.. ఇప్పుడు ఆమె లేని లోటు కనిపిస్తుందంటూ చెబుతున్నారు.
హౌస్ లో మొత్తం నసే ఉందని.. వీలైతే ఉమాదేవిని రీఎంట్రీ ఇస్తే బాగుండని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఆమె అభిమానులు. ఏం చేయాలన్నా బిగ్ బాస్ చేతిలోనే ఉంది. ఇలా పారితోషికం తీసుకొని మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వడం అనేది కష్టమే.
హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…