బిగ్ బాస్ 5 ప్రారంభమయ్యే అప్పుడే ఐదు వారాలు కావస్తోంది. 19 మంది కంటెస్టెంట్ లతో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఎంతో రసవత్తరంగా కొనసాగుతూ ప్రతి వారం ఒకరు ఎలిమినేట్ కాగా ఇప్పటికే నలుగురు ఎలిమినేట్ అయ్యారు. ఇక ఈ వారంలో 8 మంది నామినేషన్ లిస్ట్ లో ఉన్నారు.అయితే గత నాలుగు వారాల నుంచి ఒక్కసారిగా నామినేషన్ లిస్ట్ లో లేని యూట్యూబ్ స్టార్ట్ షణ్ముక్ ఈవారం నామినేషన్ లిస్ట్ లోకి చేరాడు.

బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ అయినప్పటి నుంచి అసలు తన బిగ్ బాస్ హౌస్ లో ఉన్నాడా లేదా అన్న విధంగా ఉండే షణ్ముఖ్ జస్వంత్ ఒక్కసారిగా నామినేషన్ లిస్ట్ లోకి చేరే సరికి అతని అసలు రూపం బయట పెడుతున్నాడు. అయితే షణ్ముఖ్ ఎవరితోనూ గొడవ పడకుండా ఉన్నప్పటికీ అతను నామినేషన్ లోకి రావడానికి గల కారణం అతను హౌస్ సభ్యులతో కలవకుండా తన పని తాను చేసుకుంటూ ఉండటానే కారణంగా చెబుతూ ఏకంగా ఎనిమిది మంది ఇతనిని నామినేట్ చేశారు .
గొడవలకు ఎంతో దూరంగా ఉండే షన్ను, అసలు కారణం ఏమిటో తెలియకుండా కెప్టెన్ శ్రీరామ్ తో జెస్సీ గురించి గొడవ పడ్డాడు. ఇలా శ్రీరామ్ తో గొడవకు దిగిన షణ్ముఖ్ మొదటి నుంచి తాను ఎవరితో కలవకుండా తప్పు చేశానని ఇకపై హౌస్ లో ప్రతి ఒక్క కంటెస్టెంట్ తోను అతను ఈ విధంగా ఉంటానంటూ వింతవింతగా ప్రవర్తిస్తున్నాడు.షణ్ముఖ హౌస్లో చేస్తున్నటువంటి వింత ప్రవర్తన చూసిన నెటిజన్లు పెద్దఎత్తున తన గురించి సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
ఒక్కసారి నామినేషన్ లిస్ట్ లో ఉంటే తట్టుకోలేకపోతున్నావు హౌస్ లో ఇలాగే బిహేవ్ చేస్తే తప్పకుండా ఈవారం రెడ్ కార్డు (ఓటింగ్ లేకుండా హోస్ట్ నేరుగా అతని హౌస్ నుంచి ఎలిమినేట్ చేసే అవకాశం ఉంటుంది) ద్వారా హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతాడని పలువురు కామెంట్లు చేస్తున్నారు. షణ్ముఖ జశ్వంత్ తన పద్ధతి మార్చుకోకపోతే ఈ వారం తన డేంజర్ జోన్ లో పడతాడని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.





























