Bigg Boss6: బుల్లితెరపై ప్రసారమవుతున్న బిగ్ బాస్ కార్యక్రమం నాలుగు వారాలను పోటీ చేసుకుని ఐదవ వారంలో కొనసాగుతుంది. ఇప్పటికే ఈ కార్యక్రమం నుంచి నలుగురు కంటెస్టెంట్ లు బయటకు వెళ్లారు. ఇక ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో బిగ్ బాస్ బర్తడే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే బిగ్ బాస్ కంటెస్టెంట్లకు ఎంతో ఫన్ అందించారు.అదేవిధంగా హౌస్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్ల కోరికలను కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారు.

ఈ సందర్భంగా బిగ్ బాస్ కంటెస్టెంట్ల కోరికలను చెప్పమని చెప్పగా ఒక్కొక్కరు వారి కోరికలను బయటపెడుతూ ఎమోషనల్ అయ్యారు. తన పుట్టినరోజు సందర్భంగా శ్రీహాన్ అనాధలకు భోజనం పెట్టాలని భావించారు. అయితే బిగ్ బాస్ హౌస్ లో ఉండటం వల్ల సిరికి ఆ పని పూర్తి చేయమని చెబుతూ ఎమోషనల్ అయ్యారు.అదేవిధంగా బాలాదిత్య హౌస్ నుంచి బయటకు వెళ్ళగానే తన కూతురికి పేరు పెడతానని చెప్పారు.
తన కుటుంబ సభ్యులందరూ మాట్లాడినటువంటి ఒక వీడియో పంపిస్తే చాలు అంటూ పింకీ తన కోరిక బయటపెట్టింది. అమ్మ వాళ్లు మాట్లాడినటువంటి ఒక వీడియో చూపిస్తే చాలు అంటూ ఫైమా తన కోరిక బయటపెట్టింది.ఇలా హౌస్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్లు వారి వారి కోరికలను బయట పెట్టగా ఇక ఇనయ మాత్రం తన కోరికను బయట పెడుతూ ఎమోషనల్ అయ్యారు.

Bigg Boss6 : కెప్టెన్ గా రేవంత్..
ఈ సందర్భంగా ఇయన సుల్తానా తన కోరికను బయటపెడుతూ.. తన తల్లి బిగ్ బాస్ హౌస్ కి వస్తే తనని గట్టిగా హాగ్ చేసుకుని ఏడవాలని ఉంది.తనని నాన్న అంత బాగా చూసుకోలేనేమో కానీ నాన్న గుర్తుకు రాకుండా మాత్రం తనని చూసుకోగలను అంటూ ఈ సందర్భంగా ఇనయా సుల్తానా తన కోరికను బయట పెడుతూ ఎమోషనల్ అయ్యారు. ఈ వారం కెప్టెన్సీ కండెన్సర్ టాస్క్ లో భాగంగా ఆరుగురు కంటెస్టెంట్ లు పోటీపడిగా రేవంత్ కెప్టెన్ గా నిలిచినట్టు తెలుస్తుంది.































