Adi Reddy: ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ ఆలయంలో జనవరి 22వ తేదీ స్వామి వారి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటికే ఈ ఆలయ నిర్మాణానికి ఎంతో మంది ఎన్నో విధాలుగా విరాళాలు అందజేశారు అదే విధంగా భక్తులు కూడా వారికి తోచిన విధంగా కానుకలను రాములోరికి పంపిస్తున్న సంగతి మనకు తెలిసిందే.
ఇలా స్వామివారి భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున విరాళాలను అందజేస్తూ తమ వంతు సహాయంగా నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ రివ్యూయర్ గా బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఆదిరెడ్డి కూడా రామ మందిరానికి తన వంతు సహాయం చేశారు. ఈ విషయాన్ని ఈయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
అయోధ్య రామ మందిరానికి తన వంతు సహాయంగా లక్ష రూపాయలు విరాళం అందించానని ఆదిరెడ్డి తెలిపారు. రామ మందిరం ఏర్పాటు చేయడం అనేది మన హిందువులందరి కళ ఇది మన కల అందుకే ఉడత భక్తితో తాను కూడా కొంత డబ్బు విరాళంగా ఇచ్చానని ప్రతి ఒక్కరు కూడా తమ వంతు విరాళం ఇవ్వాలని ఆదిరెడ్డి ఈ సందర్భంగా అందరినీ కోరారు .
రామ మందిరం మన కల..
ఇక జనవరి 22వ తేదీ జరగబోయే రాముల వారి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ఎంతోమంది సెలబ్రిటీలు హాజరు కాబోతున్నారు. కేవలం సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి సెలబ్రిటీలు మాత్రమే కాకుండా ప్రముఖ వ్యాపారవేత్తలు రాజకీయ నాయకులు క్రీడా రంగానికి చెందినటువంటి ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు.
నేటి వేగవంతమైన జీవనశైలిలో చాలా మంది ఎదుర్కొంటున్న సాధారణ సమస్యల్లో ముఖంపై మొటిమలు ఒకటి. ప్రత్యేకంగా యువతలో ఇది ఎక్కువగా…
భారత ప్రధాని నరేంద్ర మోడీ రాజకీయాల్లోనే కాదు, అంతర్జాతీయ వేదికలపై కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించే నాయకుడిగా గుర్తింపు పొందారు. విదేశీ…
తెలుగు డిజిటల్ మీడియాలో సంచలనం రేపుతున్న ట్రావెల్ వ్లాగర్ అన్వేష్ అలియాస్ “నా అన్వేషణ” మరోసారి వార్తల్లో నిలిచాడు. ప్రపంచ…
తిరుమలలో వైద్య సేవ చేయాలనుకునే వారికి మంచి అవకాశం అందుబాటులోకి వచ్చింది. Tirumala Tirupati Devasthanams (టీటీడీ) ఆధ్వర్యంలో నడుస్తున్న…
అమ్మాయిల్లో చాలామందికి జుట్టు సరిగ్గా పెరగడం లేదనే ఆందోళన ఉంటుంది. పల్చగా, బలహీనంగా మారిన జుట్టు వల్ల చాలా మంది…
గుడికి వెళ్లి దైవదర్శనం చేసుకుని బయటకు వస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. కానీ మెట్ల దగ్గర వదిలిన చెప్పులు కనిపించకపోతే…