Shiv Thakare: సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంటుందనే విషయం మనకు తెలిసిందే. ఇలా క్యాస్టింగ్ కౌచ్ అనేది కేవలం అమ్మాయిలు మాత్రమే ఎదుర్కొంటున్న ఇబ్బందులు అని చాలామంది భావించేవారు అయితే ఈ ఇబ్బందులు అబ్బాయిలు కూడా ఎదుర్కొంటున్నారని ఈ మధ్యకాలంలో క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులను ఎదుర్కొంటున్నటువంటి వారు ఒక్కొక్కరుగా ఈ విషయాలను బయటపెడుతున్నారు.

తాజాగా హిందీ బిగ్ బాస్ సీజన్ 16 కంటెస్టెంట్ గా పాల్గొని రన్నర్ గా నిలిచిన శివ ఠాక్రే విపరీతమైన ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు.ఇలా బిగ్ బాస్ తర్వాత పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈయన ఏకంగా సినిమా అవకాశాలను కూడా అందుకుంటున్నారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి శివ ఠాక్రే తాను కూడా ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులను ఎదుర్కొన్నాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ ముంబైకి వచ్చిన మొదట్లో తాను అవకాశాల కోసం తిరుగుతున్నానని తెలిపారు.ఆరమ్ నగర్లో నేను ఆడిషన్ కి వెళ్ళినప్పుడు ఓ డైరెక్టర్ నన్ను బాత్ రూమ్ లోకి రమ్మన్నారు అక్కడికి వెళ్ళగా ఆయన ఇక్కడ మసాజ్ సెంటర్ ఉంది ఆడిషన్ అయిపోగానే అక్కడికి వచ్చేసే అంటూ తనకి చెప్పి వెళ్లారని తెలిపారు. ఆడిషన్ కి వెళ్ళిన తర్వాత మసాజ్ సెంటర్ కు వెళ్లడం ఏంటి అని తనకు సందేహం కూడా కలిగిందని తెలిపారు.
Shiv Thakare: ఇండస్ట్రీలో ఎలా ఉంటావో చూస్తాను…
మరోసారి ఓ మహిళ విషయంలో కూడా అలాగే జరిగిందని తెలిపారు. ఓ మహిళ నన్ను అర్ధరాత్రి 11 గంటలకు ఆడిషన్ కి రావాలని పిలిచారు అంటూ ఈయన వెల్లడించారు. తనకు సిటీలో నాలుగు బంగ్లాలు ఉన్నాయని,ఎంతోమందిని పెద్ద పెద్ద స్టార్ హీరోలను చేశాను అంటూ ఈమె చెప్పారు. అయితే అర్ధరాత్రి 11 గంటలకు ఆడిషన్ కు వెళ్లుస్తున్నారు అంటే ఎందుకు పిలుస్తున్నారో అర్థం చేసుకోలేనీ అమాయకుడు కాదని నేను రానని చెప్పేయడంతో నువ్వు రాకపోతే ఇండస్ట్రీలో ఎలా కొనసాగుతావో చూస్తాను అంటూ తనని బెదిరించారని నటుడు శివ ఠాక్రే వెల్లడించారు.




























