Alekhya Harika: దేత్తడి పిల్లగా యూట్యూబ్ ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి వారిలో అలేఖ్య హారిక ఒకరు. ఈమె తెలంగాణ యాసలో మాట్లాడుతూ ఎన్నో యూట్యూబ్ వీడియోలు షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా యూట్యూబ్ ద్వారా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి హారికకు బిగ్ బాస్ అవకాశం వచ్చింది.

ఇలా బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి హారిక అనంతరం కెరియర్ పరంగా ఎంతో బిజీగా మారిపోయారు. ఈమె తన వెబ్ సిరీస్లలో నటిస్తూనే మరోవైపు సినిమా అవకాశాలను కూడా అందుకున్నారు. అయితే సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటిస్తున్నటువంటి హారిక ప్రస్తుతం హీరోయిన్గా అవకాశం కూడా అందుకున్నారు.
బేబీ సినిమా ద్వారా దర్శకుడిగా నిర్మాతగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి సాయి రాజేష్, ఎస్ కే ఎన్ సంయుక్తంగా నిర్మిస్తున్నటువంటి సినిమాలో ఈమె హీరో ఇంకా నటించే అవకాశం అందుకున్నారు. ఈ సినిమాలో సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులను ప్రారంభించుకుంది ఇక ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే.
హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసిన హారిక…
ఇదిలా ఉండగా తాజాగా ఈమె తన సొంత ఇంటి కలలను నెరవేర్చుకున్నారు. ఇలా కొత్త ఇల్లు కొనుగోలు చేసినటువంటి హారిక గృహప్రవేశం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ గృహప్రవేశ కార్యక్రమానికి పలువురు యూటూబర్స్ హాజరై సందడి చేశారు. ఈ సందర్భంగా హారికతో కలిసి దిగినటువంటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇవి కాస్త వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే అభిమానులు కూడా ఈమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.




























