బుల్లితెరలో బిగ్ బాస్ సందడి మొదలైంది. తెలుగు రాష్ట్రాల ప్రజలు మొత్తం తెలుగు బిగ్ బాస్ ముందు వాలిపోయారు. ఈరోజు 6 గంటలకు ప్రారంభమైన ఈ షోకు క్షణంలోనే రేటింగ్ ఓ రేంజ్ లో దూసుకుపోయింది. ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న బుల్లితెర అభిమానులకు ఎవరెవరు బిగ్ బాస్ లో పాల్గొంటున్నారని తెగ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికే బుల్లితెర, వెండితెర సెలబ్రిటీలు కొందరు పాల్గొనగా బిగ్ బాస్ హౌస్ లో సందడి, రచ్చ మొదలైంది. ఈ సీజన్ భారీ బడ్జెట్ తో పాటు హౌస్ లో చాలా మార్పులు కూడాచేశారు.
ఇక నాగార్జున బిగ్ బాస్ సీజన్ 3 నుండి హోస్టింగ్ చేస్తూనే ఉన్నాడు. తన హోస్టింగ్ తో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకోగా మంచి ఆదరణ కూడా లభించింది. దీంతో సీజన్ 4,5 లను కూడా నాగార్జుననే హోస్టింగ్ చేస్తున్నాడు.
ఇక ఇందులో ఫస్ట్ కంటెస్టెంట్ గా యాంకర్, బుల్లితెర నటి సిరి హనుమంత ఎంట్రీ ఇవ్వగా బాగా సందడి చేసింది.
రెండవ కంటెస్టెంట్ గా మరో బుల్లితెర నటుడు సన్నీ కూడా ఎంట్రీ ఇచ్చి తన మాటలతో అందర్నీ ఆకట్టుకున్నాడు.
ఇక మూడో కంటెస్టెంట్ గా లహరి షేరి కూడా ఎంట్రీ ఇచ్చి నాగార్జునను ప్రపోజల్ చేసి ఫిదా చేసింది.
నాలుగో కంటెస్టెంట్ గా సింగర్ శ్రీ రామచంద్ర బిగ్ బాస్ లోకి అడుగు పెట్టి తన పాటలతో అందరినీ తన వైపు లాక్కున్నాడు.
ఇక ఐదవ కంటెస్టెంట్ గా డాన్స్ మాస్టర్ అని అడుగు పెట్టి తన డాన్స్ తో ఫిదా చేసింది.
ఆరో కంటెస్టెంట్ గా లోబో అడుగు పెట్టాడు. అంతేకాకుండా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన క్షణం లోనే అందరితో బాగా క్లోజ్ అయ్యాడు.
ఇక ఏడో కంటెస్టెంట్ వెండితెర నటి ప్రియా అడుగు పెట్టి ఎంతో సున్నితంగా ఆకట్టుకుంది.
ఎనిమిదో కంటెస్టెంట్ గా మోడల్ జెస్సి అడుగుపెట్టి తను స్టైల్ తో బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు.
తొమ్మిదో కంటెస్టెంట్ గా జబర్దస్త్ ఆర్టిస్ట్ ట్రాన్స్ జెండర్ ప్రియాంక అడుగు పెట్టి తన అందంతో, మాటలతో బాగా ఆకట్టుకుంది.
పదో కంటెస్టెంట్ గా యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ అడుగు పెట్టాడు. తన సైలెంట్ మాటలతో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.
పదకొండవ కంటెస్టెంట్ గా హమిద బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
పన్నెండవ కంటెస్టెంట్ గా డాన్సర్ నటరాజ్ హౌస్ లోకి అడుగు పెట్టి తమ పరిచయాన్ని మరింత ఎక్కువగా పెంచుకున్నారు.
పదమూడవ కంటెస్టెంట్ గా యూట్యూబ్ స్టార్ బోల్డ్ బ్యూటీ సరయు అడుగు పెట్టింది. తన భాషతో, మాటలతో నాగార్జుననే ఫిదా చేసింది.
పద్నాలుగవ కంటెస్టెంట్ గా నటుడు, కండలవీరుడు విశ్వ హౌస్ లోకి అడుగు పెట్టాడు.
పదిహేనవ కంటెస్టెంట్ గా బుల్లితెర నటి ఉమాదేవి అడుగు పెట్టింది.
పదహారవ కంటెస్టెంట్ గా బుల్లితెర నటుడు మానస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.
పదిహేడవ కంటెస్టెంట్ ఆర్జే కాజల్ ఎంట్రీ ఇచ్చింది. తన గడగడ మాటలతో బాగా ఆకట్టుకుంది.
పద్దెనిమిదవ కంటెస్టెంట్ గా శ్వేతా వర్మ ఎంట్రీ ఇచ్చి తన పరిచయాన్ని మరింత పెంచుకుంది.
ఇక పంతొమ్మిదవ కంటెస్టెంట్ గా యాంకర్ రవి ఎంట్రీ ఇచ్చాడు.
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…