బిగ్‌బాస్ సీజన్-5 ఆరో వారంలో హౌస్ నుంచి శ్వేతా వర్మ ఎలిమినేట్ అయ్యారు. ఆమెకు అతి తక్కువ ఒట్లు రావడంతోనే ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించాడు. ఆమెకు అలా రావడానికి పరోక్షంగా రవి కూడా కారణం అయ్యాడనేది ఆమె అభిమానుల వాదన. అయితే ఈ వారం మొత్తం 10 మంది నామినేషన్లో ఉండగా.. అందులో నుంచి శనివారం లోబో ఎలిమినేట్ అయ్యాడంటూ అతడిని సీక్రెట్ రూమ్‌లో ఉంచారు.

ఆదివారం శ్వేత ఎలిమినేషన్‌ను ప్రకటించారు. ఇక ఆమె హౌస్ నుంచి నాగార్జున వద్దకు వచ్చిన సందర్భంగా తన హౌస్ జర్నీకి సంబంధించి ఓ వీడియోను చూపించారు. అందులో శ్వేత కాస్త ఎమోషనల్ అయినట్లు కనిపించింది. ఇక ట్రాఫిక్ సిగ్నల్ చూపించి, హౌస్‌మేట్స్‌లో ఎవరికి ఏది అన్వయమవుతోంది అడిగారు.
అందులో హౌస్ లో ఉన్న కంటెస్టంట్లలో ఎవరికి దూరంగా ఉండాలని అడగ్గా.. ఆమె రవికి దూరంగా ఉండాలని చెబుతుంది. ఇటీవల జరిగిన గేమ్‌లో నేను, లోబో దొరికిపోయాం. గేమ్‌ను దృష్టిలో పెట్టుకుని రవికి దూరంగా ఉంటే మంచిది అని హౌస్ లో ఉన్న వారికి సలహా ఇస్తుంది. రవితో చాలడేంజర్ అతడితో జాగ్రత్త అంటూ చెబుతుంది శ్వేత.
ఇక తర్వాత అపాయం ఎవరితో అని అడగ్గా మానస్ అంటూ చెబుతుంది. పోటీ పరంగా మంచి వ్యక్తి మానస్..అతడిని అంచనా వేలయలేం అంటూ చెప్పుకొచ్చింది. ఇక తక్కువ మాట్లాడాలి.. ఎక్కువ ఆడాలి అన్న దానికి ఆమె యానీ మాస్టార్ ను సెలెక్ట్ చేసుకుంటుంది.
శ్రీరామ్ చంద్రకు పాజిటివ్‌గా ఉండు. ఉదయం లేచిన దగ్గరి నుంచి రాత్రి వరకూ అందరినీ అలరించు. నువ్వు మంచి వ్యక్తివి. టాప్-5లో ఉండాలని కోరుకుంటున్నా అంటూ.. రీచర్జ్ అంటూ చెబుతుంది. ఇక విశ్వా టాస్క్ లు బాగా ఆడతాడని కితాబు ఇస్తుంది శ్వేత.



























