Categories: FeaturedMovie News

లహరి ఎలిమినేట్ అవ్వడానికి కారణాలు ఇవే..!

తెలుగులో అతి పెద్ద రియాల్టీ షో బిగ్ బాస్. నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకొని ఐదో సీజనల్లో కూడా మూడు వారాలను కంప్లీట్ చేసుకుంది. 19 మంది కంటెస్టంట్లను లోపలకు పంపించిన బిగ్ బాస్ ఈ సారి.. ఎవరినీ వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా లోపలకు పంపించలేదు. అస్సలు ఈ సారి అలా ఉంటుందా.. ఉండదా కూడా తెలియడం లేదు.

మొదట్లో యాంకర్ వర్షిని లేదా జబర్దస్త్ వర్ష అనుకున్నారు కానీ.. అలాంటి సూచనలు ఏవీ ఉండటం లేదు. ఇదిలా ఉంటే మూడో వారం ఎలిమినేట్ అయిన లహరి అలియాస్ అమ్ము ఇలా హౌస్ నుంచి బయటకు వస్తుందని ఎవరూ ఊహించి ఉండకపోవచ్చు. చాలామంది ప్రియా వస్తుంది అనుకున్నారు కానీ అనూహ్యంగా లహరి బయటకు వచ్చింది. దీనికి గల కారణం ఏంటంటే.. మొదటి నుంచి ఈమె దూకుడు స్వభావంతో ఉన్నారు. గ్లామర్ గా కనిపించినా.. ఇలా ఎదురుదాడి దిగితే చూసేవాళ్లకు హౌస్ లో ఉండే వారికి కాస్త ఇబ్బంది ఉంటుంది.

ఇలా ఆమె హౌస్ లో కూడా చీటికీమాటికీ గొడవలు పెట్టుకుంటూ బ్యాడ్‌ నేమ్‌ తెచ్చుకుంది. ఇక మెయిన్ కారణంలోకి వస్తే.. సింగిల్ మెన్ వ్యవహారం. రవి, ప్రియాలు లహరి తన వెంట పడుతుంది.. యాంకరింగ్ కోసమే తన వద్దకు వస్తుంది అని రవి ప్రియాతో చెప్పడం.. అటు రవికి.. ఇటు లహరికి ఎంతో బ్యాడ్ అయింది. దాని వల్లనే ప్రియా ఆ సింగిల్ మెన్ అనే ప్రస్తావన తెచ్చనంటూ చెప్పడంతో ఆమె తప్పులేదన్నట్లు ప్రేక్షకులకు తెలిసింది.

అయితే ఇక్కడ లహరిపై మగాళ్లతో బిజీ అని ప్రియ కామెంట్లు చేయడంతో ఆమె మీద కొంత వ్యతిరేకత ఏర్పడింది. ఆ వ్యతిరేకత రవి, ప్రియాల మధ్య జరిగిన సంభాషణ లహరిపై సానుభూతిని చూపించలేక పోయాయి. ఇదిలా ఉండగా ఉమాదేవి బయటకు వచ్చినప్పుడు లహరి ఆ హౌస్ లో ఉండటం వేస్ట్ అంటూ చెప్పిన విషయం తెలిసిందే. ఇలా పలు కారణాల వల్ల లహరి హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు అని చెప్పవచ్చు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 weeks ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 weeks ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 weeks ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 weeks ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 weeks ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

4 weeks ago