తెలుగులో అతి పెద్ద రియాల్టీ షో బిగ్ బాస్. నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకొని ఐదో సీజనల్లో కూడా మూడు వారాలను కంప్లీట్ చేసుకుంది. 19 మంది కంటెస్టంట్లను లోపలకు పంపించిన బిగ్ బాస్ ఈ సారి.. ఎవరినీ వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా లోపలకు పంపించలేదు. అస్సలు ఈ సారి అలా ఉంటుందా.. ఉండదా కూడా తెలియడం లేదు.

మొదట్లో యాంకర్ వర్షిని లేదా జబర్దస్త్ వర్ష అనుకున్నారు కానీ.. అలాంటి సూచనలు ఏవీ ఉండటం లేదు. ఇదిలా ఉంటే మూడో వారం ఎలిమినేట్ అయిన లహరి అలియాస్ అమ్ము ఇలా హౌస్ నుంచి బయటకు వస్తుందని ఎవరూ ఊహించి ఉండకపోవచ్చు. చాలామంది ప్రియా వస్తుంది అనుకున్నారు కానీ అనూహ్యంగా లహరి బయటకు వచ్చింది. దీనికి గల కారణం ఏంటంటే.. మొదటి నుంచి ఈమె దూకుడు స్వభావంతో ఉన్నారు. గ్లామర్ గా కనిపించినా.. ఇలా ఎదురుదాడి దిగితే చూసేవాళ్లకు హౌస్ లో ఉండే వారికి కాస్త ఇబ్బంది ఉంటుంది.
ఇలా ఆమె హౌస్ లో కూడా చీటికీమాటికీ గొడవలు పెట్టుకుంటూ బ్యాడ్ నేమ్ తెచ్చుకుంది. ఇక మెయిన్ కారణంలోకి వస్తే.. సింగిల్ మెన్ వ్యవహారం. రవి, ప్రియాలు లహరి తన వెంట పడుతుంది.. యాంకరింగ్ కోసమే తన వద్దకు వస్తుంది అని రవి ప్రియాతో చెప్పడం.. అటు రవికి.. ఇటు లహరికి ఎంతో బ్యాడ్ అయింది. దాని వల్లనే ప్రియా ఆ సింగిల్ మెన్ అనే ప్రస్తావన తెచ్చనంటూ చెప్పడంతో ఆమె తప్పులేదన్నట్లు ప్రేక్షకులకు తెలిసింది.
అయితే ఇక్కడ లహరిపై మగాళ్లతో బిజీ అని ప్రియ కామెంట్లు చేయడంతో ఆమె మీద కొంత వ్యతిరేకత ఏర్పడింది. ఆ వ్యతిరేకత రవి, ప్రియాల మధ్య జరిగిన సంభాషణ లహరిపై సానుభూతిని చూపించలేక పోయాయి. ఇదిలా ఉండగా ఉమాదేవి బయటకు వచ్చినప్పుడు లహరి ఆ హౌస్ లో ఉండటం వేస్ట్ అంటూ చెప్పిన విషయం తెలిసిందే. ఇలా పలు కారణాల వల్ల లహరి హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు అని చెప్పవచ్చు.































