Amardeep Chowdary: బిగ్ బాస్ కార్యక్రమం ఎంతో ఘనంగా ముగిసింది ఈ కార్యక్రమం 15 వారాలను ఎంతో విజయవంతంగా పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. 15వ వారంలో భాగంగా విన్నర్ ఎవరు అనే విషయంపై అందరిలోనూ ఆత్రుత ఉంది అయితే చివరికి అనుకున్న విధంగానే రైతుబిడ్డ బిగ్ బాస్ విజేతగా నిలిచారు. ఇక ఈ ఫినాలే లో భాగంగా రవితేజ వేదిక పైకి రాగానే అమర్ దీప్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ఇలా రవితేజ అంటే తనకు ఎంత అభిమానమో నాగార్జున తెలియజేశారు. అలాగే అమర్ కూడా రవితేజతో కాసేపు మాట్లాడారు అయితే నాగార్జున ఇక్కడే ఒక ట్విస్ట్ ఇచ్చారు. రవితేజ సినిమాలో నీకు నటించే అవకాశం రావాలి అంటే ఇప్పుడే గేట్స్ ఓపెన్ అవుతాయి బయటకురా అంటూ ట్విస్ట్ ఇవ్వడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. నాగార్జున అమర్ కు 7 సెకండ్ల టైం ఇవ్వగా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా గేటు వద్దకు వచ్చి నిలబడ్డారు.
ఇలా తన అభిమాన హీరో సినిమాలో నటించడం కోసం తన 15 వారాల కష్టాన్ని కూడా వదిలేసి బయటకు రావాలని నిశ్చయించుకోవడంతో ఒక్కసారిగా రవితేజ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు అయితే తన అభిమాన హీరో సినిమాలో నటించడం కోసం బయటకు వచ్చేయడానికి సిద్ధమైనటువంటి అమర్ ను చూసి తన తల్లి అలాగే భార్య ఒక్కసారిగా ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
కన్నీళ్లు పెట్టుకున్న తేజు..
అయితే రవితేజ మాత్రం అమర్ కు మంచి ఆఫర్ ఇచ్చారని తెలుస్తుంది. తన సినిమాలలో నటించడమే కాకుండా ఆయన హీరోగా తన బ్యానర్ లో ఒక సినిమాని చేయడానికి కూడా సిద్ధమయ్యారని అందుకు సంబంధించి ఇప్పటికే తనకు కోటి రూపాయల రెమ్యూనరేషన్ చెక్ కూడా పంపించారు అంటూ వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా ఈ కార్యక్రమం ద్వారా అమర్ మంచి సక్సెస్ అందుకున్నారనే చెప్పాలి.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…