Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ యూట్యూబర్ గా ఒక రైతు బిడ్డగా రైతుల పడే కష్టాలన్నీటిని తెలియజేస్తూ రైతుబిడ్డగా మంచి ఆదరణ సంపాదించుకున్నారు. అయితే ఈయనకు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాలి అన్నది ఎప్పటినుంచో కోరికగా ఉంది అంటూ తరచూ తన వీడియోలు ద్వారా తెలియజేసేవారు. దీంతో ఈయన బిగ్ బాస్ సీజన్ సెవెన్ కంటెస్టెంట్ గా పాల్గొన్నారు. ఇలా బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ఉన్నటువంటి పల్లవి ప్రశాంత్ మొదటి నుంచి కూడా తన ఆట తీరుతో అందరిని మెప్పించి భారీ స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్నారు.
ఇలా ఒక కామన్ మ్యాన్ గా హౌస్ లోకి వచ్చినటువంటి ఈయన చివరికి కప్పు గెలుచుకొని బిగ్ బాస్ విన్నర్ గా బయటకు వచ్చారు. ఇక పల్లవి ప్రశాంత్ గెలవడంతో బిగ్ బాస్ వేదికపై ఈయన మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తనకు బిగ్ బాస్ కార్యక్రమమంటే చాలా ఇష్టం అని అయితే ఈ కార్యక్రమానికి రావడం కోసం నేను ఎంతో కష్టపడ్డాను అని తెలిపారు. కొన్నిసార్లు పస్తులు కూడా ఉన్నానని అయితే ఈ విషయాలన్నింటిని మా ఇంట్లో వారికి తెలియనివ్వలేదని తెలిపారు.
ఇక బిగ్ బాస్ కార్యక్రమంలో గెలుచుకున్నటువంటి ప్రైజ్ మనీ గురించి కూడా మరోసారి వేదికపైనే ప్రశాంత్ మాట్లాడారు తాను గతంలో రైతుల కోసమే ఆ డబ్బు ఉపయోగిస్తానని చెప్పాను ఇప్పుడు కూడా అదే మాటపై ఉన్నానని తెలిపారు. ఎవరైతే కష్టాలలో ఉన్నారో అలాంటి రైతులకు తన ప్రైజ్ మనీ ఇచ్చేస్తానని ప్రశాంత్ తెలిపారు.
కారు నాన్నకు..నగలు అమ్మకు..
ఇక విన్నర్ కు ప్రైజ్ మనీ తో పాటు ఒక కారు అలాగే జోయాలుకాస్ వారి బంగారు ఆభరణాలను కూడా అన్ని ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. అయితే కారును తన తండ్రికి ఇస్తానని బంగారం తన తల్లికి ఇస్తాను అంటూ ఈ సందర్భంగా ప్రైజ్ మనీ గురించి పల్లవి ప్రశాంత్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ విషయంలో తగ్గేదే లేదంటూ ప్రశాంత్ తన స్టైల్లో చెప్పుకు వచ్చారు.
హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…