Pallavi prashanth: రైతుబిడ్డగా వీడియోలు చేసుకుంటూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి పల్లవి ప్రశాంత బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్నారు బిగ్ బాస్ కార్యక్రమంలో విజేతగా నిలబడ్డారు. అయితే ఈ కార్యక్రమంలో విజేతగా నిలిచినటువంటి ప్రశాంత్ కొన్ని కారణాలవల్ల అరెస్టు కావాల్సి వచ్చింది. గ్రాండ్ ఫినాలే రోజు తన అభిమానులు చేసిన హంగామా వల్ల ప్రభుత్వ ఆస్తులు నష్టం కావడంతో ఈయనని A1 ముద్దాయిగా గుర్తించినటువంటి పోలీసులు తనని అరెస్టు చేసి రిమాండ్ కి తరలించారు.
ఇలా ప్రశాంత్ తన తమ్ముడు మనోహర్ ఇద్దరూ కూడా 14 రోజులపాటు చంచల్గూడా జైలుకు రిమాండ్ కు వెళ్లారు. అయితే ఈయనని అరెస్టు చేసిన 48 గంటలలోపే బెయిల్ రావడం విశేషం. బెయిల్ పై విడుదల అయినటువంటి పల్లవి ప్రశాంత్ కి కొన్ని కండిషన్లు కూడా పెట్టినట్లు తెలుస్తుంది. ఇలా జైలు నుంచి విడుదలైన తర్వాత పల్లవి ప్రశాంత్ తన ఇంస్టాగ్రామ్ లో పేరును మార్చుకున్నారని తెలుస్తుంది.
ఈయన సూచనల మేరకు తన సోదరుడు ఇంస్టాగ్రామ్ పేజీలో తన పేరును మార్చారని తెలుస్తోంది. ఇందులో భాగంగ Malla ochina, spy team winner అని పేరును మార్చుకున్నారు ప్రస్తుతం ఈయన ఇంస్టాగ్రామ్ పేజ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తనకి బిగ్ బాస్ కార్యక్రమంలో శివాజీ యావర్ ఎంతో సపోర్ట్ గా నిలిచారని ఈయన పలు సందర్భాలలో తెలియజేశారు తన విజయానికి వారే కారణమని కూడా తెలిపారు.
Spy టీం విన్నర్…
ఈ విధంగా శివాజీ యావర్ సపోర్ట్ ఉండటంతోనే ఈయన ఇంస్టాగ్రామ్ లో కూడా తన పేరును మార్చుకున్నారని తెలుస్తోంది. ఇక ప్రశాంత్ అరెస్టు కావడంతో బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్లు కూడా ఈ విషయంపై స్పందిస్తూ తన అరెస్టు అన్యాయమని ఈ విషయంలో తన తప్పు ఏమీ లేదు అంటూ తనకు మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక ప్రశాంత్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ ఘటనపై ఏమైనా స్పందిస్తారా అనే విషయాలు తెలియాల్సి ఉన్నాయి.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…