యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జశ్వంత్, దీప్తి సునయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరూ కలిసి ఎన్నో వీడియోలలో నటించడమే కాకుండా పలు వెబ్ సిరీస్ లలో బాగా పాపులర్ అయ్యారు. వీరిద్దరి మధ్య వచ్చినటువంటి లవ్ వీడియోలు ఎంతో పాపులర్ కావడంతో వీరిద్దరి మధ్య నిజంగానే యాంగిల్ ఉందంటూ నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ ఎంతో చనువుగా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున వార్తలు పుట్టుకొచ్చాయి.

అయితే ఈ విధమైనటువంటి వార్తలపై దీప్తి సునయన, షణ్ముఖ్ స్పందిస్తూ ఆ వార్తలు నిజం కాదని, ఎప్పుడు ఖండించలేదు. అలాగని వారిద్దరూ రిలేషన్ లో ఉన్నారనే విషయాన్ని కూడా బయట పెట్టలేదు. ప్రస్తుతం షణ్ముఖ్ బిగ్ బాస్ కంటెస్టెంట్ గా వెళ్లడంతో దీప్తి సునైనా ఒంటరిగా గడుపుతున్నారు.ఈ క్రమంలోనే నిత్యం సోషల్ మీడియా వేదికగా షణ్ముఖ్ జస్వంత్ తో కలిసి ఉన్నటువంటి ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ మిస్ యు…లవ్ యూ అంటూ కామెంట్లు పెట్టారు.

ఈ క్రమంలోనే షణ్ముఖ్ జస్వంత్ బిగ్ బాస్ హౌస్ లో ఉంటూ తనను ఎంతగానో మిస్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే శనివారం జరిగిన ఎపిసోడ్ లో భాగంగా తన పిల్లో పై ఉన్న పిల్ల ఎవరు అని అడగగా షణ్ముఖ్ ఏ మాత్రం ఆలోచించకుండా దీప్తి పేరును చెప్పేశాడు. ఇలా దీప్తి సునయన పేరు చెప్పడంతో వీరిద్దరూ లవ్ లో ఉన్నట్లు తెలిసిపోతుంది.
అదేవిధంగా షణ్ముఖ్ ఎక్కువగా ఏ హౌస్మేట్స్ గురించి మాట్లాడుతున్నాడని అడగగా అందుకు విశ్వ వెంటనే దీప్తి అంటూ సమాధానం చెప్పాడు. షణ్ముక్ హౌస్లో నిత్యం దీప్తి సునయన కలవరిస్తూ ఉంటాడని చెప్పడంతో షణ్ముఖ్ జస్వంత్, దీప్తి సునయనతో ఉన్న లవ్ ను అఫీషియల్ గా బయటపెట్టినట్లు తెలుస్తోంది. ఇక ఆదివారం ఎపిసోడ్ లో భాగంగా షణ్ముఖ్ కంటెస్టెంట్ ప్రియతో కలిసి చేసిన డాన్స్ పర్ఫార్మెన్స్ పై నాగార్జున ప్రశంసలు కురిపించారు. మొత్తానికి షణ్ముఖ్ బిగ్ బాస్ ఎంట్రీ ఇవ్వడంతో ఒకరికొకరు దూరమైన షణ్ముఖ్, దీప్తి మధ్య లవ్ యాంగిల్ ఉందని షణ్ముఖ్ చెప్పకనే చెప్పేశారు.





























