Bimbisaara : ఒక సినిమా ఎవరైనా హీరో తో మొదలు పెడితే అంతకుముందు ఆ సినిమా కథ కొంతమంది హీరోలు రిజెక్ట్ చేయడం లాంటివి ఇండస్ట్రీ లో మామూలుగా జరుగుతూనే ఉంటుంది. అయితే రిజెక్ట్ చేసిన సినిమా సూపర్ హిట్ అయితే మాత్రం షాక్ అవుతుంటారు. సినిమా కథలను అంచనా వేయడంలో విఫలం అవ్వడం వలననే ఇలా జరుగుతుంటుంది. ఆ తరువాత బాధ పడినా ప్రయోజనం ఉండదు. ప్రస్తుతం ఈ కోవలోకి వస్తారు రవితేజ.

ముందు రవితేజ దగ్గరికే కథ వెళ్ళింది…
తాజాగా కళ్యాణ్ రామ్ హీరోగా నూతన దర్శకుడు మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో ఆగష్టు 5 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన బింబిసార ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిదిందే. అయితే ఈ సినిమా కథ ముందు హీరో రవి తేజ దగ్గరకి వెళ్లిందట. కాకపోతే రవితేజ ఈ కథను రిజెక్ట్ చేశారు. తాజాగా రవితేజ హీరోగా రామారావు ఆన్ డ్యూటీ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది, కానీ పరాజయం పొందింది. ఈ ప్లాప్ సినిమా కారణంగా రవితేజ సూపర్ హిట్ సినిమాను కోల్పోయాడు అని ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు.

అయితే కళ్యాణ్ రామ్ మాత్రం ఈ సినిమాపై మొదటినుండి కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. సినిమా పోస్టర్ మరియు ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అయితే పోస్టర్ ట్రైలర్ లను చూసి, మగధీర బాహుబలి లాగ అనిపిస్తున్నాయి సినిమా అలా ఉంటుందో అని నెగిటివ్ ట్రోల్ల్స్ వచ్చినా కళ్యాణ్ రామ్ మాత్రం తన నమ్మకాన్ని కోల్పోలేదు. ఆ నమ్మకం తోనే విడుదల అయ్యాక అందరికీ సమాధానం చెప్పాడు.
































