వినడానికి కామెడీగా ఉన్నా ఇదే నిజం. బిర్యాని ఒక ఇంటిని నాశనం చేసింది. ఒక మహిళ ఆత్మహత్య చేసుకోడానికి దారితీసింది. భార్యా భర్తలు అనగా ఇద్దరి మధ్యలో గొడవలు సహజం. అప్పుడప్పుడు గొడవలు జరుగుతూ ఉంటాయి. చిన్న చిన్న గొడవలు జరగని వివాహబంధం ఉండదు. అయితే వాటిని లైట్ తీసుకునేవారు కొందరైతే, పెద్దవి చేసుకుని విడిపోయేవారు మరికొందరు. వాటిలో కొన్ని గొడవలు మన పెద్డవారు కలగజేసుకుని వారికి నచ్చచెబుతూ వారిని కలుపుతూ ఉంటారు. మరికొందరు ఎన్ని చెప్పినా కూడా వినకుండా విడిపోయి విడాకులు తీసుకునేవారు కొందరు. ఇది మామూలుగా జరిగే విషయమే. అయితే తాజాగా జరిగిన ఘటన చుసిన పోలీసులు సైతం ఆశ్చర్యానికి లోనవుతున్నారు. తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ లో జరిగిన ఈ ఘటన వెంకటయ్య అనే ప్రైవేట్ ఉద్యోగి అయన భార్య పద్మ, ఆమె భర్త వెంకటయ్యని చికెన్ బిర్యానీ తీసుకురావాలని కోరింది.

తాజాగా మరోసారి కూడా తనకు చికెన్ బిర్యానీ తినాలని ఉందని తీసుకునిరమ్మని చెప్పిందట. అయితే భార్య మాటను పట్టించుకోని భర్త యధావిధిగా ఆ రాత్రికూడా బిర్యానీ తీసుకురాకుండా ఉత్త చేతులతో వచ్చాడట. పండంటి కాపురంలో బిర్యానీ చిచ్చు పెట్టింది. తాను అడిగిన బిర్యానీ తీసుకురాలేదని ఆవేశంలో నిప్పంటించుకుని ఆత్మ హత్యాయత్నం చేసింది ఈ మహిళ. ఈ సంఘటన హైదరాబాద్ లో జరిగింది. వెంకటయ్య, అతని భార్య పద్మ (28) ఇద్దరు కలిసి రెహ్మాత్ నగర్ లో నివసిస్తున్నారు. వెంకటయ్య ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అయితే ఎప్పటినుంచో ఆమె భర్త వెంకటయ్యని చికెన్ బిర్యానీ తీసుకురావాలని కోరుతోంది. అయితే తాజాగా బుధవారం కూడా తనకు చికెన్ బిర్యానీ తినాలని ఉందని తీసుకునిరమ్మని చెప్పిందట. యధావిధిగా ఆ రాత్రికూడా వెంకటయ్య ఉత్త చేతులతో వచ్చాడు.

ఈ విషయంపై ఇద్దరి మధ్య భారీ యుద్ధమే జరిగింది. అది మాట మాట పెరిగి ఇద్దరి మధ్య భారీ గొడవకు దారితీసింది. దీనితో తన మాటలకూ విలువ ఇవ్వడంలేదని భావించిన పద్మ అంతా నిద్రపోతున్న సమయంలో తన ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పటించుకుంది. ఇది చుసిన ఇరుగు పొరుగు వాళ్ళు వెంటనే 108 కి ఫోన్ చేయడంతో వెంటనే హుటాహుటిన ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పడంతో ఆమె భర్త వెంకటయ్య పోలీసులకు ఫిర్యాదుచేశారు. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here