BJP leader Sadineni Yamini : ఏపీ రాజకీయాళ్లలో ఎవరు ఎవరి వైపున్నారో, ప్రజలు ఏ పార్టీ వైపు ఉన్నారో ఏమాత్రం అంచనా వేయలేని పరిస్థితి. ఒకవైపు వైసీపీ మాదే అధికారం అంటుంటే మరోవైపు టీడీపీ నెక్స్ట్ మేమే వస్తాం అంటోంది. ఇక జనసేన కూడా మెల్లగా వారాహి యాత్ర తరువాత పుంజుకుంటూ గట్టి కాంపిటిషన్ ఇచ్చేలాగానే ఉంది. ఇక బీజేపీ ఎవరికి మిత్రువో ఎవరితో కలిసి ఉందో ఆ నేతలే చెప్పలేని పరిస్థితి. ఇక ఏపీ రాజకీయాల్లో బీజేపీ దారెటు, ఎవరితో పొత్తులు, ఎవరితో కాయ్యాలు వంటి విషయాలను బీజేపీ రాష్ట్ర మహిళా నేత సాధినేని యామిని శర్మ ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.

వాలంటీర్ల మీద పవన్ మాటలు… మాతో టీడీపీ పొత్తు…
సాధినేని యామిని రాష్ట్ర ప్రభుత్వం గురించి మాట్లాడుతూ కేంద్రం ఇస్తున్న నిధులను ఖర్చు చేస్తూ రాష్ట్రము స్టిక్కర్లను వేసుకుంటూ వాళ్ళిస్తున్నట్లు ప్రజలలో ప్రచారం చేసుకుంటున్నారు అంటూ విమర్శించారు. ఇక జనసేన పుంజుకుంటున్న విషయం మాట్లాడుతూ ఆ మిత్ర పక్షం పుంజుకోవడం మాకు సంతోషమే. మా పార్టీకి కావాల్సింది ప్రభుత్వంతో పోరాడే వాళ్లే అంటూ చెప్పారు.

వైసీపీ తో చీకటి అనుబంధం గురించి మాట్లాడుతూ ఏ పార్టీతో అయినా గొడవ పడాల్సిన పనిలేదు. రాష్ట్ర ప్రభుత్వంతో ఘర్షణ వాతావరణం కేంద్రానికి ఇష్టం లేదు. పార్టీల పరంగా విబేధాలు ఉండవచ్చు కానీ పాలన విషయంలో కాదు అంటూ చెప్పారు. ఇక వారాహి యాత్రలో పవన్ వాలంటీర్ల గురించి మాట్లాడిన మాటల గురించి యామిని స్పందిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలకు తెల్లారాక ఆయనే మళ్ళీ వివరణ ఇచ్చారు. ప్రజలకు సహాయం చేయడానికి పథకాలను అందించడానికి వాలంటీర్ వ్యవస్థ బాగానే ఉంది కానీ వైసీపీ వారిని పార్టీ కార్యకర్తలుగా వాడుకోవడం అక్షేపనీయం అంటూ చెప్పారు. ఇక పొత్తుల గురించి అధిష్టానం చూసుకుంటుంది, కార్యకర్తలకు మా స్థాయి నేతలకు పొత్తుల గురించి తెలిసేది మీడియా ద్వారానే, ఎవరితో పొత్తు పెట్టుకున్నా కార్యకర్తలు సమన్వయపరుచుకుంటూ పనిచేస్తాము అంటూ చెప్పారు.