BJP Leader Subramanian Swamy : గుజరాత్ నుండి చిన్న వ్యాపారవేత్తగా మొదలయిన ఆదాని ప్రయాణం నేడు ప్రపంచ కుభేరుల జాబితాలో టాప్ 10 లోకి చేరింది. అయితే కొత్త సంవత్సరం టాప్ 10 లో ఉన్న ప్రపంచ కుభేరులలో కేవలం ఆదాని సంపద మాత్రమే తరిగిపోయి టాప్ ప్లేసులో ఉన్న తనకు ఏడో స్థానానికి దిగజారాడు. గత కొద్ది రోజులుగా స్టాక్ ఎక్స్చేంజ్ లో మోసాలకు పాల్పడినట్లు ఆదాని గ్రూప్ మీద వార్తలు వెలువడ్డాయి. అదానీ గ్రూప్ స్టాక్ మార్కెట్లో మోసాలకు పాల్పడినట్లు ప్రముఖ పెట్టుబడుల పరిశోధక సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపించింది. అమెరికాకు చెందిన ఈ కంపెనీ దాదాపు రెండున్నరేళ్ల పాటు చేసిన పరిశోధనలలో అదానీ గ్రూప్ తన స్టాక్స్‌లో భారీ అవకతవకలకు పాల్పడుతోందని, అకౌంటింగ్ మోసాలు కూడా చేస్తోందని ఆరోపణలు గుప్పించింది. దశాబ్దాల కాలంగా స్టాక్ మానిపులేషన్ జరుగుతోందని, అకౌంటింగ్ ఫ్రాడ్ స్కామ్ జరుగుతోందని పరిశోధన రిపోర్ట్‌ను తాజాగా విడుదల చేసింది. ఈ రిపోర్ట్ వెలువడడంతో ఒక్కసారిగా ఆధాని గ్రూప్ స్టాక్స్ పడిపోయి దాదాపు ఒక్కరోజులోనే 5.9 బిలయన్ డాలర్ల సంపద అంటే ఇండియన్ కరెన్సీ లో దాదాపుగా 49 వేల కోట్ల సంపద అవిరైపోయింది.

ఆస్తులను జాతీయం చేయాలి…
ఈ ఇష్యూ మీద బీజేపీ లీడర్ సుబ్రమణియన్ స్వామి హాట్ కామెంట్స్ చేసారు. అదాని ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని వేలం వేయాలని సూచించారు. అలా వేలం వేయగా వచ్చిన డబ్బులను స్టాక్స్ లో నష్టపోయిన వారికి ఇవ్వాలని, ఇలా చేసి బీజేపీ తన పవిత్రతను నిరూపించుకోవాలని చెప్పారు. కాంగ్రెస్ వాళ్లలో కొంతమందికి అదానితో స్నేహాలు ఉన్నాయని, అయినా నేను కాంగ్రెస్ గురించి పట్టించుకోవడం లేదంటూ ప్రభుత్వం అదాని విషయంలో ఏ మాత్రం సమర్తించడం లేదు అనే విషయం బయటికి తెలిసేలా చేయాలంటూ సుబ్రమణియన్ స్వామి తెలిపారు.

ఇక నిర్మలా సీతారామన్ బడ్జెట్ గురించి హాట్ కామెంట్స్ చేసారు సుబ్రమణియన్. అసలు బడ్జెట్ నమ్మశఖ్యంగా లేదంటూ కామెంట్స్ చేసారు. ఇంతవరకు వృద్ధి రేటు 3 లేక 4 శాతం దాటకుండా ఉంటే వచ్చే ఏడాది వృద్ధి రేటు అంచనా 6.5 శాతంగా ఆర్థిక మంత్రి ప్రకటించడం విడ్డూరంగా ఉందని బడ్జెట్ లో వ్యవసాయం, పరిశ్రమల ఊసే లేదంటూ విమర్శించారు.





























