Borugadda Anil Kumar : ఎన్నికలకు ఏడాది సమయం ఉండగానే అప్పుడే పార్టీలలో లకలుకలు మొదలయిపోయాయి. అధికారపార్టీ వైపుకు ఇన్నిరోజులు జంపింగులు చూస్తే ఇప్పుడు అధికార పార్టీ నుండి ప్రతిపక్షానికి జంపింగ్ మొదలయింది. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో కాక పుట్టిస్తూ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ జగన్ ప్రభుత్వాన్ని విమర్శించి టీడీపీ లోకి జంప్ అయ్యారు. ఇక జగన్ ను వారి ఎమ్మెల్యే తో విమర్శిస్తే వైసీపీ నాయకులు ఊరుకుంటారా వైసీపీ చిన్న చిన్న లీడర్లు కూడా ఘాటు వాఖ్యలతో రెచ్చిపోయారు. అలా నెల్లూరు రాజకీయం గుంటూరు వరకు వెళ్ళింది. గుంటూరు జిల్లా వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ కుమార్ కోటం రెడ్డి కి కాల్ చేసి మరీ వర్నింగ్ ఇవ్వడంతో ఆ తరువాత కొద్దిరోజులకు అతని ఆఫీస్ బిల్డింగ్ కు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. ఇక ఈ విషయాల మీద బోరుగడ్డ అనిల్ కుమార్ యూట్యూబ్ లో ఒక ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు.

జగన్ ను విమర్శిస్తే కబడ్దార్…
అనిల్ కుమార్ మాట్లాడుతూ టీడీపీ వాళ్ళు దాడులు చేస్తున్నారని కోటం రెడ్డి లాంటి వాళ్లకి 200 కోట్లు ఆఫర్ చేసి చంద్ర బాబు వైసీపీ నేతలను పార్టీలోకి లాక్కుపోతున్నాడని విమర్శించారు. నేను లేనపుడు నా ఇంటి మీద దాడి చేయడం కాదు నేను ఉన్నపుడు వచ్చి చేయండి, వచ్చిన ఒక్కకొక్కడికి మంచి సన్మానం చేస్తాను బిర్యానీ, పెరగన్నం పెట్టి పంపిస్తా అంటూ బూతులతో రెచ్చిపోయాడు అనిల్ కుమార్.

జగన్ అంటే చచ్చేంత అభిమానం అని తనని ఎవరైనా ఏదైనా అంటే వైసీపీ నేతలు ఊరికే చూస్తూ ఉండరు అంటూ హెచ్చరించాడు అనిల్ కుమార్. వైసీపీ నేతలు బూతులతో టీడీపీ వాళ్లను తిట్టడానికి కారణం మొదట వాళ్ళే బూతులతో మాట్లాడారంటూ ఆరోపించారు అనిల్ కుమార్. తెలుగు ప్రజలు ప్రపంచంలో ఎక్కడున్నా వారందరికీ అనిల్ కుమార్ ఏ సమయంలో ఇంట్లో ఉంటాడు ఏ సమయంలో పార్టీ క్యాంపు ఆఫీస్ లో ఉంటాడో తెలుసు, దమ్ము ధైర్యం ఉంటే నేను ఉన్నపుడు దాడి చేయడానికి రండి అంటూ మాట్లాడాడు అనిల్ కుమార్.