Bramhanandham : కామెడీలో బ్రహ్మానందం ఒకెత్తు మిగిలిన వారు మరో ఎత్తు. తెలుగు సినిమాలో ఆయన కామెడీ నచ్చని ప్రేక్షకులుండరు. ఆయన సినిమాలో ఉంటే చాలు సినిమా హిట్ అవుతుంది అనే సెంటిమెంట్ మొదలై ఆయనకోసం ప్రత్యేకంగా పాత్రలు సృష్టించిన రోజులు ఉన్నాయి. లెక్చరర్ గా కెరీర్ మొదలు పెట్టిన ఆయన ఆ తరువాత యాదృచ్చికంగా సినిమాల్లో కి వచ్చి కమెడియన్ గా ఎన్నో వందల సినిమాల్లో నటించి మెప్పించారు. బ్రహ్మనందం గారు ఇటీవల ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో మాట్లాడుతూ ఎన్టీఆర్ గారి గురించి ఆసక్తికర విషయాలను మాట్లాడారు.

మోహన్ బాబు వద్దన్నా ఎన్టీఆర్ పెట్టుకున్నారు…
మేజర్ చంద్రకాంత్ సినిమాలో ఎన్టీఆర్ గారితో కలిసి నటించే అవకాశం నాకు లభించిందని బ్రహ్మానందం గారు తెలిపారు. అప్పటి వరకు అందరు హీరోలతో చేసినా ఏఎన్ఆర్ వంటి వారితో నటించినా ఎన్టీఆర్ తో నటించే అవకాశం వస్తుందో రాదో అని బయపడ్డానని ఆయన శత జయంతి వేడుకల్లో పంచుకున్నారు. ఇక మేజర్ చంద్ర కాంత్ సినిమాలో ఒక రిక్షావాడి పాత్రలో నటించేనందుకు వేరేవారిని తెసుకోవాలని మొదట అనుకున్నారు. మోహన్ బాబు బ్రహ్మానందం వద్దు బిజీ ఉంటాడు, చిన్న పాత్రకు ఎందుకు, మనకు టైం అడ్జస్ట్ చేయలేము అతని బిజీ షెడ్యూల్ కి అని చెప్పినా రాఘవేంద్రరావు గారిలోకి ఎన్టీఆర్ గారే వచ్చారేమో కానీ నన్ను తీసుకుందామని అనుకున్నారు, నాకు అలానే అనిపిస్తోంది అంటూ బ్రహ్మానందం తెలిపారు.

ఇక ఆయన సీఎంగా ఉన్నపుడు ట్యాంక్ బండ్ మీద విగ్రహాలు పెట్టినందుకు కొంతమంది వృధా ఖర్చు అని విమర్శించగా వాటికి తన సినిమాలో సమాదానం చెప్పాలని అన్నగారు భావించి ఆ రిక్షా వాడి పాత్రతో అదే డైలాగ్ చెప్పించి దానికి సమాధానం ఎన్టీఆర్ చెప్పేలా చేసారు రాఘవేంద్ర రావు. అయితే ఆ రిక్షావాడి పాత్ర ఎవరో చేస్తే జనాలు పట్టించుకోరు అందుకే బ్రహ్మానందం అయితే జనాలు ఏం చెప్తున్నాడో వింటారు దానికి సమాధానం ఎన్టీఆర్ ఏం చెప్పాడో వింటారు, అందుకే ఆ పాత్ర చిన్నదైనా నన్నే తీసుకోవాలని రాఘవేంద్ర రావు భావించాడు, అలా నాకు ఎన్టీఆర్ గారితో నటించే అదృష్టం కలిగింది అంటూ చెప్పారు.































