Bramhastra : బాలీవుడ్ లో ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాలన్నీ ఒక్కొక్కటిగా బాగా ఫ్లాప్ అవుతున్నాయి. కంటెంట్ బాగోలేకపోవడం, బాయ్ కాట్ బాలీవుడ్ అంటూ జరుగుతున్న పరిణామాలు కారణం కావొచ్చు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో విడుదల అవ్వబోతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాలో రన్ భీర్, ఆలియా భట్ జంటగా నటించారు. ఇక అమితాబ్ బచ్చన్, నాగార్జున వంటి వారు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 9 న విడుదలకు సిద్ధమైంది.

ఆత్మలేని కథగా అభివర్ణన…
బ్రహ్మాస్త్ర సినిమా అటు నార్త్ లోనే కాకుండా తెలుగు, తమిళ వంటి సౌత్ భాషలలో పాన్ ఇండియా సినిమాగా విడుదల అవుతోంది. సినిమాలో నాగార్జున నటించడం, చిరంజీవి తెలుగులో వాయిస్ ఓవర్ ఇవ్వడం, ఇక జూనియర్ ఎన్టీఆర్, జక్కన్న ప్రచారం వంటివి సినిమాకు తెలుగులో కొంత హైప్ తీసుకోచ్చాయి. ఇక కొంత అంచనాలు సినిమా మీద తెలుగులో ఉన్నాయి. అయితే ఈ సినిమా చూసిన ఓవర్ సీస్ సెన్సర్ బోర్డు మెంబెర్ అయిన ఉమర్ సంధు సినిమాల రివ్యూలను ట్విటర్ వేదికగా పంచుకుంటూ ఉంటారు. ఇక బ్రాహ్మాస్త్ర గురించి ఒక్క ముక్కలో సినిమా ఎలా ఉందో చెప్పేసాడు. 400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన విజువల్స్ వండర్ గా వచ్చిన బ్రహ్మాస్త్ర సినిమా లో ఆత్మ లోపించిందని, సినిమాకు చేసిన భారీ ప్రమోషన్స్, ఓపెనింగ్ రోజున, వీకెండ్ లో వసూళ్లను రాబట్టొచ్చు కానీ ఆ తర్వాత సినిమాకు కష్టాలు తప్పవని అంచనా వేస్తూ, మెరిసేదంతా బంగారం కాదని చెప్పాడు.

#RanbirKapoor looking so confused in #Brahmastra ! He even didn’t know what’s going on ???? ! #Aliabhatt looking stunning in movie ! Wow ????! #MouniRoy looking so creepy! Loud performance by her ! #AmitabhBachchan is grace personified. The only regret is, he gets less footage.
— Umair Sandhu (@UmairSandu) September 6, 2022
ఫాంటసీ, అడ్వెంచర్ సినిమాలు హిందీలో తక్కువగా వస్తుంటాయి, ఇక అయాన్ సినిమాను ఫాంటసీ జోనర్ లో తీయడం గొప్ప ప్రయత్నం. కానీ సినిమా చాలా గందరగోళంగా అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు కొన్ని సన్నివేశాల్లో. ఇక రన్ భీర్ కన్ఫ్యూషన్ లో ఉన్నారు అనిపిస్తుంది. ఆలియా చాలా బాగా కనిపించింది సినిమాలో కానీ రన్ భీర్ నిరాశపరిచాడు అంటూ రివ్యూ ఇచ్చాడు. ఇక ఈ రివ్యూ మీద చాలా మంది నెటిజన్స్ మండిపడుతున్నారు. సినిమా చూసాక బాగోలేదని నువ్వే ఎలా డిసైడ్ చేస్తావ్ అంటూ ట్రోల్ చేస్తున్నారు. మరీ కొంతమంది బూతులు తిడుతూ ఫైర్ అవుతున్నారు.






























