ఏపీలో జూన్ 30 వరకు కర్ఫ్యూ నిబంధనల్లో తాజగా సడలింపులు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇకపై ఉదయం 6 గంటలనుండి సాయంత్రం 6 గంటల వరకు సడలింపు ఇచ్చింది. సాయంత్రం 5 గంటల వరకే దుకాణాలకు అనుమతి ఉంటుందని తెలిపింది.

అయితే కేసులు అధికంగా ఉన్న నేపధ్యంలో తూర్పుగోదావరి జిలాలో మాత్రం ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే సడలింపులకు అనుమతులు ఇచ్చింది. ఈనెల 21 నుంచి ఈ నిబంధనలు అమలులోకి వస్తాయని ఏపీ సర్కార్ పేర్కొంది. అయితే ప్రభుత్వ కార్యాలయాలు యధావిధిగా పనిచేస్తాయని తెలిపింది.




























