సినీ నటుడు, క్రిటిక్ కత్తి మహేశ్ మృతి చెందాడు. గత కొద్ది రోజుల క్రితం కత్తి మహేశ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే.. చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మహేశ్ మృతి చెందారు. ఈ మేరకు మహేశ్ మృతిని చెన్నై అపోలో ఆస్పత్రి వైద్యులు ధృవీకరించారు.

ఈనెల 26న ఘోర రోడ్డు ప్రమాదానికి గురయిన విషయం తెలిసిందే. కత్తి మహేష్ ప్రయాణిస్తున్న కారు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మహేష్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఐసీయూ లో చికిత్స పొందుతున్న కత్తి మహేష్ ఆరోగ్యం విషమించడంతో కొద్దిసేపటి క్రితం అయన కన్నుమూసారు. కత్తి మహేష్ మృతితో టాలీవుడ్ లో విషాద చాయలు అలుముకున్నాయి.




























